ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Google: జీమెయిల్, మెసేజ్‌లలోకి 'జెమిని'

ABN, Publish Date - Jun 28 , 2024 | 05:59 PM

గూగుల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గూగుల్ జెమిని(Google Gemini) ఫీచర్ జీమెయిల్, మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చింది. ఏఐ టెక్నాలజీతో పని చేసే ఈ ఫీచర్‌లో వివిధ ప్రశ్నలను అడగడంతో పాటు, ఇమెయిల్‌లను కంపోజ్ చేయడానికి, భారీ ఇమెయిల్‌లను సంగ్రహించడానికి, ప్రెజెంటేషన్ నుంచి వివిధ అంశాలను హైలైట్ చేయడానికి, ముఖ్యమైన సమావేశాల కోసం రిమైండర్‌లను సెట్ చేయమని అడగడానికి జెమిని ఉపయోగపడుతుంది.

ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గూగుల్ జెమిని(Google Gemini) ఫీచర్ జీమెయిల్, మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చింది. ఏఐ టెక్నాలజీతో పని చేసే ఈ ఫీచర్‌లో వివిధ ప్రశ్నలను అడగడంతో పాటు, ఇమెయిల్‌లను కంపోజ్ చేయడానికి, భారీ ఇమెయిల్‌లను సంగ్రహించడానికి, ప్రెజెంటేషన్ నుంచి వివిధ అంశాలను హైలైట్ చేయడానికి, ముఖ్యమైన సమావేశాల కోసం రిమైండర్‌లను సెట్ చేయమని అడగడానికి జెమిని ఉపయోగపడుతుంది.

Gemini 1.5 Pro AI మోడల్ త్వరలో గూగుల్ డాక్స్, గూగుల్ షీట్‌లు, గూగుల్ స్లైడ్స్, గూగుల్ డ్రైవ్ వంటి ఇతర Google ఉత్పత్తుల్లో విడుదల అవుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా గూగుల్ జెమిని మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇది వారం వ్యవధిలోనే 5 మిలియన్ల డౌన్‌లోడ్‌లను పొందింది. గూగుల్‌ ప్లే స్టోర్‌‌లో దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్‌డ్‌ ఏఐ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. తెలుగు సహా తొమ్మిది భారతీయ భాషలను ఇది సపోర్ట్‌ చేస్తుంది.


జెమిని 1.5ప్రొ కూడా ఇండియాలో లభిస్తుంది. జెమిని అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌ విషయానికి వస్తే, దీంతో 1500 పేజీల మేర డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్‌ చేయవచ్చు. అంతేకాకుండా 100 ఈమెయిల్స్‌ను చాట్‌బోట్‌ సమ్మరైజ్‌ చేస్తుంది. ఇచ్చిన డేటా అధారంగా చర్యకు అవసరమైన ఇన్‌సైట్స్‌ను అందిస్తుంది. కాంప్లెక్స్‌ డేటా అనాల్సిస్‌ సౌలభ్యం కూడా ఉంది. గూగుల్‌ షీట్స్‌, సీఎస్‌బీలు, ఎక్సెల్‌ నుంచి పొందిన సమాచారం నుంచి విశ్లేషణ మొదలుకుని ఇంటరాక్టివ్‌ చార్ట్స్‌ వరకు పొందవచ్చు.


జెమిని.. గూగుల్‌ మెసేజెస్‌తో ఇంటిగ్రేట్‌ అవుతుంది. దాంతో స్నేహితులు, కొలీగ్స్‌తో కొలాబిరేషన్‌కు వీలుపడుతుంది. గూగుల్ జెమినితో జీమెయిల్‌లో వేగంగా సమచారాన్ని పొందడం, ముఖ్యమైన సూచనలు అందుకోవడం, వివిధ ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టొచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ మెసేజెస్‌లో కూడా జెమిని అందుబాటులో ఉంది. భారతదేశంలోని చాలా మంది వినియోగదారులు ఈ కొత్త ఫీచర్‌ను వాడటం ప్రారంభించారు.

For Latest News and Tech News click here..

Updated Date - Jun 28 , 2024 | 06:01 PM

Advertising
Advertising