ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Back Covers: స్మార్ట్ ఫోన్ వాడతారా? ఈ తప్పు మాత్రం అస్సలు చేయొద్దు!

ABN, Publish Date - Oct 22 , 2024 | 04:11 PM

స్మార్ట్‌ఫోన్‌లకు కచ్చితంగా బ్యాక్ కవర్స్ వాడాలని నిపుణులు చెబుతున్నారు. హైక్వాలిటీ ఉన్న బ్యాక్ కవర్స్‌ను వాడితే దుమ్మూధూళి, వేడి, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. కిందపడ్డప్పుడు ఫోన్ పగిలిపోవడాన్ని ఇవి కొంతమేరకు అడ్డుకుంటాయి.

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్ లేనిదే పూట గడవని కాలం వచ్చిపడింది. రోజు మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకూ స్మార్ట్‌ ఫోన్‌తో చేసే పనులు అనేకం ఉంటాయి. చాటింగ్ మొదలు చెల్లింపుల వరకూ ఏపనికైనా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. ఇక స్మార్ట్‌ఫొన్ వాడే కొందరు బ్యాక్ కవర్స్ వాడరు. ఫోన్ లోగో కనిపించాలని, డిజైన్ కనిపించాలని ఇలా రకరకాల సాకులు చెప్పి బ్యాక్ కవర్స్‌కు నో చెప్పేస్తారు. అయితే, ఈ తప్పుతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ చాలాకాలం పాటు ఏ సమస్య లేకుండా పనిచేయాలంటే స్క్రీన్ గార్డ్స్, బ్యాక్ కవర్స్ తప్పనిసరి. స్క్రీన్ గార్డ్‌తో ఫోన్ స్క్రీన్‌పై గీతలు పడటాన్ని నివారించొచ్చు (Back covers for smart phones).

UPI Wallet: యూపీఐ చెల్లింపుల కోసం కొత్త విధానం.. వివరాలు ఇవే..


ఇక బ్యాక్ కవర్ ఎంపికలో కూడా వినియోగదారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మంచి నాణ్యతగల ఉత్పత్తులతో వివిధ రకాల డ్యామేజీల నుంచి రక్షణ లభిస్తుంది. తక్కువ ధరకు వస్తోందని చెప్పి నాణ్యత లేని బ్యాక్ కవర్స్ కొంటే దీర్ఘకాలంలో సమస్యలు తప్పవు. ఫోన్‌పై గీతలు పడకుండా ఇది మొదట నిరోధించినా రాను రాను పనితీరు తీసికట్టుగా మారుతుంది. కొద్ది నెలలకే కొత్త బ్యాక్ కవర్ కొనాల్సి వస్తుంది. ఫోన్ కిండపడిన సందర్భాల్లో కూడా ఇలాంటి బ్యాక్ కవర్స్ పూర్తిస్థాయి రక్షణ ఇవవ్వు.

Youtube: యూట్యూబ్ నుంచి మరిన్ని క్రేజీ ఫీచర్లు.. ఎలా పని చేస్తాయంటే..


హైక్వాలిటీ బ్యాక్ కవర్స్‌తో ఉపయోగాలు

మంచి నాణ్యత కలిగిన ముడిసరుకులతో వీటి తయారు చేస్తారు. ఫోన్ కిందపడ్డప్పుడు ఆ ప్రభావం స్మార్ట్ ఫోన్‌పై పడకుండా ఈ బ్యాక్ కవర్స్ పూర్తిగా గ్రహిస్తాయి. దీంతో, ఫోన్లు పగిలిపోకుండా ఉంటాయి. అదే తక్కువ నాణ్యత ఉన్న ఫోన్లతో ఈ రక్షణ లభించదు. హైక్వాలిటీ బ్యాక్ కవర్స్‌తో వేడి, నీటి నుంచి కూడా పూర్తి రక్షణ లభిస్తుంది. ఫోను చుట్టూ పటిష్ఠమైన అడ్డుగోడలా నిలిచి నీరు లోపలికి వెళ్లనివ్వవు. ఫోన్‌లో జనించే ఉష్ణం త్వరగా వాతావరణంలోకి వ్యాపించేలా ఈ బ్యాక్ కవర్స్‌ను నిర్మించడంతో ఫోన్ వేడేక్క అవకాశాలు కూడా తగ్గుతాయి. తక్కువ నాణ్యత ఉన్న బ్యాక్ కవర్స్‌తో దుమ్మూధూళీ లోపలికి వెళ్లకపోవడం మినహా ఇతరత్రా ఉపయోగాలు ఏవీ ఉండవు.

ప్రస్తుతం మార్కెట్లో లెదర్, కార్బన్ ఫైబర్, పాలీకార్బొనేట్, సిలికోన్, షాక్ ప్రూఫ్, హీట్ డెసిపేషన్ ఫీచర్ కలిగిన పలు బ్యాక్ కవర్స్ అందుబాటులో ఉన్నాయి. యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు.

For More Technology News and Telugu News

Updated Date - Oct 22 , 2024 | 04:11 PM