ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

The Boring Phone: మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి ‘ది బోరింగ్ ఫోన్’..ఫీచర్లు తెలిస్తే..

ABN, Publish Date - Apr 18 , 2024 | 02:58 PM

నోకియా ఫోన్ల తయారీ కంపెనీ హెచ్‌ఎండీ(HMD) గ్లోబల్ నుంచి ఇప్పుడు చాలా ఫన్నీ ఫోన్‌ మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఫోన్ చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. అదే ‘ది బోరింగ్ ఫోన్’(The Boring Phone). హీనెకెన్ బెవరేజ్ కంపెనీ, బోడెగా కంపెనీ సహకారంతో HMD దీన్ని రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ వివరాలు, ఫీచర్లు(features) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

hmd The Boring Phone

నోకియా ఫోన్ల తయారీ కంపెనీ హెచ్‌ఎండీ(HMD) గ్లోబల్ నుంచి ఇప్పుడు చాలా ఫన్నీ ఫోన్‌ మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఫోన్ చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. అదే ‘ది బోరింగ్ ఫోన్’(The Boring Phone). హీనెకెన్ బెవరేజ్ కంపెనీ, బోడెగా కంపెనీ సహకారంతో HMD దీన్ని రూపొందిస్తోంది. ఈ ఫోన్ పేరు బోరింగ్ అయితే దీన్ని ఎలా ఉపయోగించాలనే అనే ప్రశ్నలు అనేక మందిలో తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ వివరాలు, ఫీచర్లు(features) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


అయితే ఈ ఫోన్‌(phone)ని తయారు చేయడం వల్ల ప్రయోజనం ఏంటనేది కచ్చితంగా తెలిసిపోయింది. నిజానికి ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం ద్వారా ప్రజలు తమ స్క్రీన్ సమయాన్ని భారీగా పెంచుకున్నారు. దీన్ని తగ్గించడం సహా సోషల్ మీడియాకు దూరంగా ఉండేందుకే ఈ ఫోన్‌ను ఆవిష్కరిస్తున్నారు. చాలా సార్లు, స్మార్ట్‌ఫోన్‌లలో వచ్చే నోటిఫికేషన్‌లు వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ బేసిక్ ఫీచర్లతో మార్కెట్‌లో బోరింగ్ ఫోన్‌ను విడుదల చేస్తుంది.


ఇక మీకు సోషల్ మీడియా(social media) అంటే పిచ్చి ఉంటే ఈ ఫోన్ మీ కోసం మాత్రం కాదు. ఎందుకంటే ఇందులో మీరు సోషల్ మీడియా యాప్‌లను ఇన్‌స్టాల్ చేయలేరు. అయితే నోకియా పాత క్లాసిక్ స్నేక్ గేమ్ ఇందులో ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది. ఈ రోజు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ ఫోన్‌లలో చాలా ఫీచర్లను అందిస్తున్నప్పటికీ, ఈ ఫోన్ మీకు బోరింగ్‌గా అనిపించవచ్చు. కానీ ఫ్లిప్‌తో కూడిన దాని పారదర్శక డిజైన్ మిమ్మల్ని చాలా ఆకర్షిస్తుంది.


నోకియా(nokia) ది బోరింగ్ ఫోన్‌ 2.8 అంగుళాల స్క్రీన్‌, ఫ్లిప్ కవర్‌కు వెలుపల 1.77 అంగుళాల డిస్‌ప్లేతో లభిస్తుంది. ఇందులో మీకు 0.3 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. వినియోగదారులు ఈ ఫోన్‌లో ఎక్కువ కాలం బ్యాటరీని పొందుతారు. తద్వారా మళ్లీ మళ్లీ ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది. మీరు బోరింగ్ ఫోన్‌లో 2G, 3G, 4G కనెక్టివిటీని పొందుతారని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కంపెనీ దీన్ని ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తుందనే సమాచారం మాత్రం వెల్లడించలేదు.


ఇది కూడా చదవండి:

Google: Pixel 8a స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్

Credit Card: క్రెడిట్ కార్డ్‌ ఉపయోగం వల్ల 10 లాభాలు.. అవి ఏంటంటే

మరిన్ని సాంకేతిక వార్తల కోసం

Updated Date - Apr 18 , 2024 | 03:02 PM

Advertising
Advertising