Spam Calls: స్పామ్ కాల్స్ చికాకు పెడుతున్నాయా? ఇలా చేస్తే సరి
ABN, Publish Date - Nov 17 , 2024 | 10:32 PM
స్పామ్ కాల్స్ నుంచి తప్పించుకునేందుకు అనేక చిట్కాలు ఉన్నాయి. ఇవి ఫాలో అయితే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఇక ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడే వాళ్లు స్పామ్ కాల్స్ బాధ నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలంటే..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో స్పామ్ కాల్స్ బెడద ఎక్కువైపోయింది. బిజీగా ఉన్న సమయంలో పదే పదే వచ్చే స్పామ్ కాల్స్‌తో కొందరు చికాకు పడుతుంటారు. అయితే, వీటి నుంచి తప్పించుకునేందుకు అనేక చిట్కాలు ఉన్నాయి. ఇవి ఫాలో అయితే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఇక ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడే వాళ్లు స్పామ్ కాల్స్ బాధ నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలంటే (Technology)..
స్పామ్ కాల్స్ వద్దనుకునే వారు ముందుగా నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్‌లో తమ ఫోన్ నెంబర్ నమోదు చేసుకోవాలి. ఇందులో రిజిస్టరై ఉన్న నెంబర్లకు టెలీ మార్కెటింగ్ కాల్స్ రావు.
Aadhaar Misuse: మీ ఆధార్ మరెవరైనా వాడుతున్నారని డౌటా? ఇలా చేస్తే సరి
ఈ డీఎన్‌డీ ఫీచర్ యాక్టివేట్ చేసుకునేందుకు ఫోన్ నుంచి 1909 నెంబర్‌కు START అనే మెసేజ్ పంపించాలి
ఆ తరువాత బ్యాంకింగ్, హాస్పిటాలిటీ వంటి వివిధ రంగాలు వాటికి సంబంధించిన కోడ్స్‌తో ఓ సందేశం వస్తుంది.
ఏ రంగానికి చెందిన కాల్స్ బ్లాక్ చేయదలిచారో ఆ రంగం కోడ్‌ను మెసేజ్ రూపంలో పంపించాలి.
అనంతరం, 24 గంటల తరువాత వినియోగదారుల రిక్వెస్ట్ ప్రాసెస్ అయ్యి వారు ఎంచుకున్న రంగానికి సంబంధించి ఎటువంటి మార్కెటింగ్ కాల్స్ రావు. థర్డ్ పార్టీకి సంబంధించిన కమర్షియల్ కాల్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి.
Aadhar Card: ఆధార్‌కి కొత్త నంబర్ లింక్ చేసుకోవాలా.. అయితే ఇలా చేయండి..
ఇక కస్టమర్లు తమ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ద్వారా కూడా డీఎన్‌డీ సర్వీసును యాక్టివేట్ చేసుకోవచ్చు
జియో యాప్, ఎయిర్ టెల్ వెబ్‌సైట్, వొడాఫోన్ వెబ్‌సైట్, బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్లలో కస్టమర్లు డీఎన్‌డీ సర్వీసును యాక్టివేట్ చేసుకోవచ్చు
ఇక ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఫోన్ యాప్ ద్వారా కూడా ఒక్కో నెంబర్‌ను బ్లాక్ చేసుకోవచ్చు. ఇందు కోసం ఫోన్ యాప్‌లోని కాల్ హిస్టరీలోకి వెళ్లాలి. అందులోని స్పామ్ నెంబర్‌ను ఎంచుకుని దాన్ని బ్లాక్ చేస్తే సరిపోతుంది. అయితే, వివిధ నెంబర్ల నుంచి కమర్షియల్ కాల్స్ వస్తాయి కాబట్టి ఈ విధానం పరిమితంగానే ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఆండ్రాయిడ్ ఫోన్స్‌లోని ఫిల్టర్ స్పామ్ ఫీచర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఫోన్ యాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి, అందులోని ఫిల్టర్ స్పామ్ కాల్స్ ఆప్షన్‌ను, సీ కాలర్ అండ్ స్పామ్ ఐడీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో, కాంటాక్ట్స్ లిస్టులో లేని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఆటోమేటిక్‌గా సైలెంట్ అయిపోతాయి.
Read More Techology and Latest Telugu News
Updated Date - Nov 17 , 2024 | 10:39 PM