ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BSNL:1500GB డేటాతో 100 Mbps బ్రాడ్‌బ్యాండ్‌ను ఇలా ఉచితంగా పొందండి

ABN, Publish Date - Mar 03 , 2024 | 06:52 PM

అతి తక్కువ ధరకు మెరుగైన డేటాను అందించే దిశగా బీఎస్ఎన్ఎల్ కీలక ముందగుడు వేసింది. మీ అవసరాన్ని తీర్చేందుకు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్(BSNL) సిద్ధమయింది. అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని ఇది అందిస్తోంది. రూ.777తో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.

ఢిల్లీ: అతి తక్కువ ధరకు మెరుగైన డేటాను అందించే దిశగా బీఎస్ఎన్ఎల్ కీలక ముందగుడు వేసింది. మీ అవసరాన్ని తీర్చేందుకు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్(BSNL) సిద్ధమయింది. అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని ఇది అందిస్తోంది. రూ.777తో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. హైస్పీడ్ ఇంటర్నెట్ కోరుకునే వినియోగదారుల కోసం ఈ ప్లాన్ రూపొందించారు. తక్కువ ధరకే గణనీయమైన ప్రయోజనాలను ఇది అందిస్తోంది. ఈ ప్లాన్‌ని 2020లో ఎంపిక చేసిన నగరాల్లో ప్రారంభించారు.

బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ఈ ప్లాన్‌ను దేశంలోని చాలా నగరాలను విస్తరిస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచింది. రూ. 777 విలువైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో, చందాదారులు 100Mbps వేగంతో 1500GB డేటాను ఆస్వాదించవచ్చు. నెలవారీ డేటా అయిపోయాక వినియోగదారులు ఆ తరువాత కూడా 5Mbps వేగంతో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయవచ్చు.


తద్వారా అంతరాయం లేని ఇంటర్నెట్ కనెక్టివిటీని వినియోగదారులు పొందుతారు. డేటా కేటాయింపు, హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు, వినియోగదారులు ఉచిత అపరిమిత కాలింగ్, కాంప్లిమెంటరీ ల్యాండ్‌లైన్ కనెక్షన్ నుంచి మరిన్ని ప్రయోజనం పొందుతారు.

అలాగే BSNL ప్రస్తుతం Fiber to the Home సర్వీస్‌ను ఉచిత ఇన్‌స్టాలేషన్‌ను అందిస్తోంది. దీని ద్వారా కస్టమర్‌లు ఇన్‌స్టాలేషన్ ఛార్జీలపై రూ. 500 ఆదా చేసుకోవచ్చు. రూ. 777 ప్లాన్‌లో ఓటీటీ బెనిఫిట్స్ అయితే ప్రస్తుతానికి లేవు. రూ.799, రూ.849 ప్లాన్‌లు డేటా కేటాయింపుతోపాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తాయి.

Updated Date - Mar 03 , 2024 | 07:01 PM

Advertising
Advertising