ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AC: కూలర్‌తో విసిగిపోయారా.. రూ.300లతో ఏసీ తయారు చేయొచ్చిలా

ABN, Publish Date - Jun 10 , 2024 | 04:47 PM

కాలమేదైనా ఏసీలు(Air Conditioner), కూలర్లు లేనిదే జీవనం గడవట్లేదు. వేసవి కాలమైతే వీటికి డిమాండ్ భారీగా ఉంటుంది. వేరే సీజన్లలో కూడా కూలర్లు, ఏసీలకు సాధారణ డిమాండ్ ఉంటుంది. అయితే చాలా మంది ఏసీ కొనుగోలు చేసే స్థోమత లేక కూలర్లతో నెట్టుకొచ్చేస్తారు.

ఇంటర్నెట్ డెస్క్: కాలమేదైనా ఏసీలు(Air Conditioner), కూలర్లు లేనిదే జీవనం గడవట్లేదు. వేసవి కాలమైతే వీటికి డిమాండ్ భారీగా ఉంటుంది. వేరే సీజన్లలో కూడా కూలర్లు, ఏసీలకు సాధారణ డిమాండ్ ఉంటుంది. అయితే చాలా మంది ఏసీ కొనుగోలు చేసే స్థోమత లేక కూలర్లతో నెట్టుకొచ్చేస్తారు. ఈ మధ్య కాలంలో కూలర్లు ఎక్కువ కాలం రావట్లేదు. కూలర్లకు ఉండే గడ్డి పాడవడంతో రోజురోజుకీ అవి ఫ్యాన్లలాగే మారిపోతుంటాయి. అతి తక్కువ ధరతో కూలర్‌ని ఏసీలా మార్చుకోవచ్చని మీకు తెలుసా. రూ.300తో కూలర్‌ని ఏసీగా మార్చవచ్చు. కూలర్లో ఒక చిన్న మార్పు చేసుకుంటే ఏసీలాగే పని చేస్తుంది.

అప్‌గ్రేడ్ చేయడం ఎలా..

కూలర్లు చల్లటి గాలినివ్వడానికి ముఖ్యమైన కారణం.. వెనక గడ్డితో చేసిన కూలింగ్ ప్యాడ్. పాత కూలర్లు సాధారణంగా గడ్డితో కూడిన కూలింగ్ ప్యాడ్‌లతో వస్తాయి. అయితే అవి కాలక్రమేణా దెబ్బతింటాయి. గడ్డిపై ఆల్గే, దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా కూలర్లు కూలింగ్ ప్యాడ్‌లతో వస్తున్నాయి. వీటిని ప్రధానంగా హనీకోంబ్ ప్యాడ్‌లుగా పిలుస్తారు. ఇవి తేనెతుట్టె మాదిరిగా ఉంటాయి.

అందుకే వీటిని హనీకోంబ్ ప్యాడ్‌లని అంటారు. సంప్రదాయ గడ్డి ప్యాడ్‌లతో పోల్చినప్పుడు ఇవి చల్లటి గాలిని అందిస్తాయి. నీటిని సమర్థంగా పంప్ చేసి, తేమను చాలా కాలంపాటు నిలుపుకుంటాయి. ఎక్కువ కాలం మన్నగలవు. తద్వారా చల్లటి గాలి ఉత్పత్తి అవుతుంది. అందుకే కూలర్ల తయారీదారులు వీటిని చేయడంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు.


ఇన్‌స్టాల్ చేయడం ఇలా..

  • ముందుగా మీ కూలర్ నుంచి పాత గడ్డి కూలింగ్ ప్యాడ్‌లను తొలగించండి.

  • కూలర్‌ని పూర్తిగా శుభ్రం చేయండి.

  • ఆ తరువాత పాత వాటి స్థానంలో హనీకోంబ్ ప్యాడ్‌లని ఉంచండి.

  • ఒకసారి ఇన్‌స్టాల్ చేసిన తరువాత మీ కూలర్ ఏసీకి సమానమైన చల్లటి తాజా గాలిని అందిస్తుంది. అధిక కరెంట్ బిల్లు సమస్య లేకుండా చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చు.

ఎక్కడ దొరుకుతాయి?

హనీకోంబ్ ప్యాడ్‌లు ఆన్‌లైన్లో, ఆఫ్‌లైన్లో దొరుకుతాయి. వాటిని ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఈ - కామర్స్ సైట్‌లలోనూ కొనుగోలు చేయవచ్చు. వీటి ధర రూ.300 నుంచి రూ.400 వరకు ఉంటుంది.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 04:47 PM

Advertising
Advertising