Superfast Charging: 10 నిమిషాల్లోనే కారు చార్జింగ్.. సాంకేతికతలో సరికొత్త సంచలనం
ABN, Publish Date - May 27 , 2024 | 01:32 PM
ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ పెట్టినప్పుడు.. 100 శాతం చార్జ్ ఎక్కడానికి కనీసం మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. ఈ కారణంగా.. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లలేని పరిస్థితి..
ఎలక్ట్రిక్ వెహికల్స్ (Electric Vehicles) చార్జింగ్ పెట్టినప్పుడు.. 100 శాతం చార్జ్ ఎక్కడానికి కనీసం మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. ఈ కారణంగా.. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. అటు.. ఫోన్స్, ల్యాప్‌టాప్స్‌కి కూడా చార్జింగ్ కోసం కనీసం గంట సమయమైనా తప్పకుండా కేటాయించాలి. దీని వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఈ సమస్యకు సరికొత్త పరిష్కారం వచ్చేసింది. గంటలకొద్దీ సమయం కేటాయించే అవసరం లేకుండా.. నిమిషాల్లోనే చార్జ్ ఎక్కేలా కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
టీమిండియా హెచ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. ఫోటో చెప్పిన సాక్ష్యం?
భారతీయ సంతతికి చెందిన అంకుర్ గుప్తా అనే పరిశోధకుడు & అతని బృందం.. 10 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఒక్క నిమిషంలో మొబైల్ ఫోన్స్ & ల్యాప్‌టాప్‌లను చార్జ్ చేయగల సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించారు. కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంకుర్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. అంతేకాదు.. విద్యుత్ గ్రిడ్లలో వేగంగా విద్యుత్తును నిల్వ చేయడానికి కూడా ఈ సాంకేతికత ఎంతనోగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ ఆవిష్కరణతో సూపర్‌కెపాసిటర్స్ వంటి సమర్థవంతమైన స్టోరేజ్ డివైజ్‌లను అభివృద్ధి చేయొచ్చని అన్నారు. సూపర్‌కెపాసిటర్ అనేది వాటి రంధ్రాలలోని అయాన్ సేకరణపై ఆధారపడి ఉండే ఎనర్జీ స్టోరేజ్ డివైజ్ అని.. బ్యాటరీలతో పోల్చితే ఇవి వేగవంతమైన ఛార్జింగ్ సమయాలను, ఎక్కువ జీవిత కాలాన్ని కలిగి ఉన్నాయని వివరించారు.
పూణె కారు ప్రమాదం కేసులో షాకింగ్ ట్విస్ట్.. రిపోర్ట్‌నే మార్చేసిన డాక్టర్స్
భవిష్యత్తులో ‘ఎనర్జీ’ పోషించే కీలక పాత్రని దృష్టిలో ఉంచుకొని.. తన కెమికల్ ఇంజినీరింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎనర్జీ స్టోరేజ్ డివైజ్‌లను అభివృద్ధి చేయాలని అనుకున్నానని అంకుర్ గుప్తా పేర్కొన్నారు. అయాన్ల కదలిక ద్వారా సూపర్‌కెపాసిటర్లను ఎలా చార్జ్ చేయాలి? ఎనర్జీని వేగంగా ఎలా రిలీజ్ చేయాలనే విషయాల్ని తాము కనుగొన్నామని చెప్పారు. ఎట్టకేలకు తాము ఇన్నాళ్లకు ‘లింక్’ కనుగొన్నామని.. దీని ద్వారా చార్జింగ్ సమస్యలు తగ్గుతాయని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం.. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోళ్లు మరింత పెరుగుతాయని చెప్పుకోవచ్చు.
Read Latest Technology News and Telugu News
Updated Date - May 27 , 2024 | 01:32 PM