ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TRAI: వినియోగదారుల కోసం జియో, ఐడియా పోటీ.. వీఐ స్థానం ఎక్కడంటే

ABN, Publish Date - Jun 22 , 2024 | 03:53 PM

వినియోగదారులను ఆకర్షించేందుకు రెండు ప్రధాన టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా వినియోగదారులను రప్పించుకోగా.. ఎయిర్‌టెల్ ఆ స్థానంలో నిలిచింది. ట్రాయ్(TRAI)విడుదల చేసిన డేటా ప్రకారం.. Reliance Jio ఇప్పుడు మొత్తం 472.42 మిలియన్ల(47.2 కోట్లు) వైర్‌లెస్ చందాదారులను కలిగి ఉంది.

ఇంటర్నెట్ డెస్క్: వినియోగదారులను ఆకర్షించేందుకు రెండు ప్రధాన టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా వినియోగదారులను రప్పించుకోగా.. ఎయిర్‌టెల్ ఆ స్థానంలో నిలిచింది. ట్రాయ్(TRAI)విడుదల చేసిన డేటా ప్రకారం.. Reliance Jio ఇప్పుడు మొత్తం 472.42 మిలియన్ల(47.2 కోట్లు) వైర్‌లెస్ చందాదారులను కలిగి ఉంది. కంపెనీ యాక్టివ్ యూజర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది.

అదే సమయంలో Vi (వోడాఫోన్ ఐడియా), BSNL మొబైల్ చందాదారుల సంఖ్య మరోసారి తగ్గింది. Jio 2024 ఏప్రిల్‌లో 3.06 మిలియన్లు, అంటే దాదాపు 30 లక్షల మంది కొత్త యాక్టివ్ యూజర్‌లను తన యూజర్ బేస్‌లో చేర్చుకుంది. దీంతో 47.2 కోట్ల వినియోగదారులు జియోలో ఉన్నారు. ఎయిర్‌టెల్ కూడా ఏప్రిల్ నెలలో 7.5 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకుంది. అయితే, కంపెనీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 20 లక్షలకుపైగా తగ్గింది. Airtel క్రియాశీల వినియోగదారుల సంఖ్య 38.3 కోట్లకు చేరుకుంది.


కంపెనీ మొత్తం సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 38.6 కోట్లకు పెరిగింది. దీంతో పోల్చితే Vi, BSNL వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గింది. ఏప్రిల్‌లో Vi క్రియాశీల వినియోగదారుల సంఖ్య 6.3 లక్షలు తగ్గి... కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 21.89 మిలియన్లకు తగ్గింది. దీనికితోడు 5G అందుబాటులోకి వస్తున్నందున వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ నాణ్యత తగ్గుతోందని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి.

కంపెనీలు 5G నెట్‌వర్క్‌లను వేగంగా అభివృద్ధి చేస్తున్నందున, డౌన్‌లోడ్ వేగం కూడా గణనీయంగా తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. Opensignal నివేదిక ప్రకారం.. భారత్‌లో 5G నెట్‌వర్క్‌పై 5G సగటు డౌన్‌లోడ్ వేగం 2023 మొదటి త్రైమాసికంలో 304 Mbps నుండి అదే సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 280.7 Mbpsకి తగ్గింది.

For Latest News and Tech News click here

Updated Date - Jun 22 , 2024 | 03:53 PM

Advertising
Advertising