ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jio Bharath: జియో వినియోగదారులకు గుడ్ న్యూస్.. ధర తగ్గిందోచ్

ABN, Publish Date - Oct 26 , 2024 | 07:39 PM

దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో (Jio) బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. జియో భారత్‌ దీపావళి ధమాకా ఆఫర్‌ పేరుతో జియో భారత్ 4జీ ఫోన్ల (JioBharat 4G) ధరను తగ్గించింది.

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో (Jio) బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. జియో భారత్‌ దీపావళి ధమాకా ఆఫర్‌ పేరుతో జియో భారత్ 4జీ ఫోన్ల (JioBharat 4G) ధరను తగ్గించింది. వీటి ధర ఇప్పటివరకు రూ.999 ఉంది. దీపావళి ఆఫర్‌లో భాగంగా అక్టోబర్ 26 నుంచి రూ.699కే కొనుగోలు చేయొచ్చని జియో తన ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్‌ పరిమితకాలం మాత్రమే ఉంటుందని వెల్లడించింది. ఇతర కంపెనీల నెలవారీ రీఛార్జి ప్లాన్లతో పోలిస్తే జియో భారత్‌ ఫోన్‌ ప్లాన్లు చౌకగా ఉంటాయని కంపెనీ పేర్కొంది. వినియోగదారులకు నెలకు 40శాతం మేర (రూ.76) డబ్బుఆదా అవుతుందని చెప్పింది. జియో సిమ్‌కార్డుతో పనిచేసే ఈ ఫోన్లను దగ్గర్లోని రిలయన్స్‌ స్టోర్‌లో గానీ, జియోమార్ట్ లేదా అమెజాన్‌ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయొచ్చు.


వీటితో కస్టమర్‌లు అపరిమిత వాయిస్ కాల్‌లు, 14GB నెలవారీ డేటా, JioTVలో 455కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లను చూడవచ్చు. JioCinemaలో లైవ్ స్పోర్ట్స్, సినిమాలు, JioPay యాప్ ద్వారా UPI సేవలను పొందుతారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 లో రిలయన్స్ జియో Jio Bharat V3, Jio Bharat V4 ఫోన్‌ ఫీచర్‌లను ప్రకటించింది. కొత్త Jio Bharat 4G ఫోన్‌ల ధర రూ.1,099 నుంచి ప్రారంభమవుతుంది. రూ.123 ప్లాన్ ద్వారా వాయిస్, డేటా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్‌ కింద అపరిమిత కాల్స్‌, 14జీబీ డేటా, 455 లైవ్‌ టీవీ ఛానెల్స్‌ లభిస్తాయి. 2జీ ముక్త్‌ భారత్‌ నినాదంతో తీసుకొచ్చిన జియో భారత్‌ ఫోన్లు.. ఇప్పటికే రూ.1,000లోపు కేటగిరీలో 50 శాతం మార్కెట్‌ వాటాను సొంతం చేసుకున్నట్లు రిలయన్స్ ఓ నివేదికలో వెల్లడించింది.

ఇవి కూడాచదవండి..

TG Police: పోలీసు, పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారిన అజ్ఞాత వ్యక్తి లేఖ..

Jaggareddy: అవును.. వాళ్లను తిట్టాను.. తప్పేంటి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 26 , 2024 | 08:43 PM