Smartphone: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. కెమెరా ఫీచర్స్, ధర ఏంతంటే..

ABN, Publish Date - Jul 04 , 2024 | 01:08 PM

మీరు మంచి ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే Motorola Razr 50 Ultra నేడు (జూలై 4న) మార్కెట్లోకి వచ్చింది. ఈ వెర్షన్‌లో పెద్ద డిస్‌ప్లే, మెరుగైన డిజైన్, IP రేటింగ్, కొత్త హార్డ్‌వేర్ సహా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

Smartphone: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. కెమెరా ఫీచర్స్, ధర ఏంతంటే..
Motorola Razr 50 Ultra foldable smartphone

మీరు మంచి ఫోల్డబుల్ ఫోన్(smart phone) కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే Motorola Razr 50 Ultra నేడు (జూలై 4న) మార్కెట్లోకి వచ్చింది. ఈ వెర్షన్‌లో పెద్ద డిస్‌ప్లే, మెరుగైన డిజైన్, IP రేటింగ్, కొత్త హార్డ్‌వేర్ సహా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌తో పాటు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను కూడా కంపెనీ ఉచితంగా అందిస్తోంది. మరే ఇతర బ్రాండ్ ఇలా అందించడం లేదు. ఈ ఫోన్ 6.9 అంగుళాల FHD+ పోలెడ్ స్క్రీన్‌, లోపలి స్క్రీన్‌పై టచ్ రెస్పాన్స్ 360Hz, దాని ప్రకాశం 3000 నిట్‌ల వరకు ఉంటుంది.


ఫోటోలు తీయడానికి కొత్త వెర్షన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ f/2.0 టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. బ్యాటరీ మునుపటి మోడల్ కంటే ఇది కొంచెం పెద్దది. ఇది 4,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది కాకుండా 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కొత్త Razr 50 Ultra వాటర్ ఫ్రూఫ్ సౌకర్యం కల్గి ఉంది. ఇది IPX8 రేటింగ్‌తో నీటి నిరోధకతను కలిగి ఉండగా, మునుపటి మోడల్‌లో ఈ సౌకర్యం లేదు.


Motorola Razr 50 Ultraలో Qualcomm కొత్త Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ ఉంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే, ఇది పెద్ద కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 1080p రిజల్యూషన్, 100 శాతం DCI-P3, HDR10+ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ స్క్రీన్ స్వయంచాలకంగా 1Hz నుంచి 165Hz మధ్య రిఫ్రెష్ రేట్‌ను సర్దుబాటు చేస్తుంది. ఫోన్ ఆఫ్ చేయబడి ఉంటే మీరు ఈ పెద్ద స్క్రీన్‌లో వీడియోలు, మ్యాప్‌లను తనిఖీ చేయవచ్చు, సెల్ఫీలను ప్రివ్యూ చేసుకోవచ్చు.

Motorola Razr 50 Ultra పరికరం Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో పాటు 12GB RAM అందించబడుతుంది. Motorola Razr 50 Ultra 12GB RAM, 512GB స్టోరేజ్‌తో మోడల్ కోసం రూ.99,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఈ పరికరంపై రూ. 5,000 ఫ్లాట్ తగ్గింపు, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై అదనంగా రూ. 5,000 తగ్గింపు ఉంది. ఈ ఫ్లిప్ ఫోన్ అమెజాన్, రిలయన్స్ స్టోర్లు, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విక్రయించబడుతుంది.


ఇవి కూడా చదవండి:

WhatsApp: వాట్సాప్‌ నుంచి మరో రెండు అద్భుతమైన ఫీచర్‌లు


YouTube: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. మీ వాయిస్, ఫేస్ ఉపయోగించి రూపొందించే ఏఐ వీడియోలపై ఫిర్యాదు చేయవచ్చు..


Read Latest Technology News and Telugu News

Updated Date - Jul 04 , 2024 | 01:11 PM

Advertising
Advertising