ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ola: ఇకపై గూగుల్ మ్యాప్స్ కాదు.. ఓలా మ్యాప్స్

ABN, Publish Date - Jul 07 , 2024 | 04:01 PM

ఇకపై గూగుల్ మ్యాప్స్(Google Maps) కాదు.. ఓలా మ్యాప్స్.. ఇదేంటి.. గూగుల్ మ్యాప్స్ స్థానంలో ఓలా మ్యాప్స్ రాబోతున్నాయా. అంటే అవుననే అంటున్నారు ఓలా కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్. కానీ ఒక ట్విస్ట్. ఓలా యాప్‌లోనే ఈ మార్పు అని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇకపై గూగుల్ మ్యాప్స్(Google Maps) కాదు.. ఓలా మ్యాప్స్.. ఇదేంటి.. గూగుల్ మ్యాప్స్ స్థానంలో ఓలా మ్యాప్స్ రాబోతున్నాయా. అంటే అవుననే అంటున్నారు ఓలా కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్. కానీ ఒక ట్విస్ట్. ఓలా యాప్‌లోనే ఈ మార్పు అని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. నగరాలు, పట్టణాల్లో ఓలా, ర్యాపిడో లేని ప్రయాణాన్ని ఊహించుకోలేం.

ఇన్నాళ్లు ర్యాపిడో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా పని చేస్తూ వస్తోంది. ఇప్పుడు తాజాగా గూగుల్ మ్యాప్స్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు భవీశ్ చెప్పారు. సొంతంగా సిద్ధం చేసుకున్న ఓలా మ్యాప్‌‌నకు మళ్లినట్లు భవీశ్ పేర్కొన్నారు. యాప్‌ను అప్డేట్ చేసుకుని తాజా సేవలను పొందవచ్చని వివరించారు.


'గత నెలలో మైక్రోసాఫ్ట్ అజూర్ నుంచి వైదొలిగాం. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ నుంచి బయటకి వచ్చాం. గూగుల్ మ్యాప్స్ కోసం ఏటా రూ.100 కోట్లను ఖర్చు పెట్టేవాళ్లం. ఇపుడు సొంత మ్యాప్స్ కారణంగా మా ఖర్చు సున్నాకు చేరింది' అని అగర్వాల్ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. స్ట్రీట్ వ్యూ, ఇండోర్ ఇమేజెస్, త్రీడీ మ్యాప్స్, డ్రోన్ మ్యాప్స్ తదితర ఫీచర్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.

ఓలా ఎలక్ట్రిక్ సొంతంగా సాలిడ్ స్టేట్ బ్యాటరీలనూ తయారు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఓలా విద్యుత్ స్కూటర్లకు ఈ బ్యాటరీలనే వినియోగించనుంది. 2021 అక్టోబరులో పుణేకు చెందిన జియోస్పేషియల్ సర్వీస్ ప్రొవైడర్ అయిన జియోస్పోక్‌ను ఓలా కొనుగోలు చేసింది. గత నెలలో అగర్వాల్.. మైక్రోసాఫ్ట్ అజూర్‌తో వ్యాపార సంబంధాలు ముగించారు.

For Latest News and National News Click Here

Updated Date - Jul 07 , 2024 | 04:01 PM

Advertising
Advertising
<