ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

New Mobiles: జూన్‌లో రాబోతున్న స్మార్ట్‌ఫోన్లు, వాటి ఫీచర్లివే..

ABN, Publish Date - May 27 , 2024 | 02:54 PM

స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. జూన్ నెలలో రకరకాల ఫీచర్లతో వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. మీరు ఫోన్ కొనాలనే ప్లాన్‌లో ఉంటే.. వన్‌ప్లస్, వివో, హానర్, షియోమీ వంటి అనేక కంపెనీల కొత్త మోడళ్ల ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. జూన్‌లో రానున్న ఫోన్ల వివరాలు పరిశీలిద్దాం..

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. జూన్ నెలలో రకరకాల ఫీచర్లతో వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. మీరు ఫోన్ కొనాలనే ప్లాన్‌లో ఉంటే.. వన్‌ప్లస్, వివో, హానర్, షియోమీ వంటి అనేక కంపెనీల కొత్త మోడళ్ల ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. జూన్‌లో రానున్న ఫోన్ల వివరాలు పరిశీలిద్దాం..

Vivo X ఫోల్డ్ 3 ప్రో

Vivo కంపెనీ Vivo X ఫోల్డ్ 3 ప్రోని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. జూన్ 6న ఇది విడుదల కానుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్‌ని కలిగి ఉంటుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,700mAh బ్యాటరీతో బ్యాకప్‌తో వస్తుంది.

OnePlus Nord CE4 Lite

ప్రముఖ నార్డ్ సిరీస్‌కి వన్‌ప్లస్ మరో స్మార్ట్‌ఫోన్‌ను జోడించనుంది. కంపెనీ OnePlus Nord CE4 Lite పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. దీన్ని జూన్ మధ్య వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 24,999గా నిర్ణయించారు. ఈ కొత్త Nord పరికరం 48+8+2 MP వెనుక కెమెరా (ట్రిపుల్) సెటప్‌ను కలిగి ఉంటుంది.


Xiaomi సిటిజెన్ 4 ప్రో

Xiaomi Civi 4 ప్రో జూన్ 2024 మధ్యలో విడుదల చేసే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర రూ. 49,999గా ఉండనుంది. దీని బాడీ, కెమెరా యూజర్లను ఆకట్టుకుంటోంది.

Motorola Edge 50 Ultra, Motorola G85

Motorola జూన్‌లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనుంది. అవి Motorola Edge 50 Ultra, Motorola G85. రెండు డివైజ్‌లు 4500mAh బ్యాటరీ,125W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యానికి కలిగి ఉంటాయి. ఎడ్జ్ 50 అల్ట్రా ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది- 64 MP + 50 MP + 50 MP సెన్సార్లు కలిగి ఉంటుంది. దీంతో ఫుల్ క్లారిటీలో ఫొటోలు తీయవచ్చు. ఇవే కాకుండా ఎలెక్ట్రానిక్ మార్కెట్లో జూన్‌ నెలలో ఎన్నో రకాల కొత్త ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

For Latest News and Technology News

Updated Date - May 27 , 2024 | 02:55 PM

Advertising
Advertising