ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mobiles: ఫోన్ల వెనక వాలెట్లు ఉంచుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా

ABN, Publish Date - Jun 03 , 2024 | 07:37 AM

స్మార్ట్‌ఫోన్‌లు(Smartphones) దైనందిన జీవితంలో భాగంగా మారాయి. ఫోన్‌లతో కాలింగ్, మెసేజ్‌లు పంపడం, ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్‌ల పౌచ్‌ల వెనక కవర్ కింద డబ్బులు, కార్డ్‌లు (డెబిట్ లేదా క్రెడిట్)వంటి వాలెట్‌లను ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం డేంజరని మీకు తెలుసా..

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్‌లు(Smartphones) దైనందిన జీవితంలో భాగంగా మారాయి. ఫోన్‌లతో కాలింగ్, మెసేజ్‌లు పంపడం, ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్‌ల పౌచ్‌ల వెనక కవర్ కింద డబ్బులు, కార్డ్‌లు (డెబిట్ లేదా క్రెడిట్)వంటి వాలెట్‌లను ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం డేంజరని మీకు తెలుసా..

క్యాష్ లేదా కార్డులను ఉంచితే..

కార్డ్‌లను (క్రెడిట్, డెబిట్ లేదా మెట్రో కార్డ్) ఫోన్ వెనక వైపు ఉంచడం చాలా మందికి అలవాటే. అత్యవసర పరిస్థితుల సమయంలో ఆ డబ్బు, కార్డులు ఉపయోగపడతాయని అలా చేస్తారు.

హీటింగ్ సమస్య

స్మార్ట్‌ఫోన్‌ వాడుతూ ఉంటే వేడి ఉత్పత్తి అవుతుంది. అతిగా చూడటం (OTTలు), గేమింగ్ లేదా నిరంతరంగా వీడియోలు ప్లే వంటి పనులతో ఫోన్ తీవ్రంగా హీటెక్కుతుంది. స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ వేడి కావడంతో వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో ఫోన్ వెనక క్యాష్, కార్డులు వంటివి ఉంచితే అవి కాలి, ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది. కార్డులు, క్యాష్ ఉంచడం వల్ల కూడా ఫోన్ హీటెక్కే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఫోన్ పేలకపోయినా.. దాని జీవితకాలం తగ్గుతుంది.


నెట్‌వర్క్‌లో..

చాలా కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో వాటి యాంటెన్నాలను పైభాగంలో ఉంచుతాయి. నగదు లేదా కార్డ్‌లను వెనుక ప్యానెల్ కింద ఉంచడం వలన డివైజ్‌లో సిగ్నల్‌లను స్వీకరించే యాంటెన్నాకు ఆటంకం ఏర్పడవచ్చు. కార్డ్‌లో సెన్సార్‌లు, చిప్‌లు ఉండే అవకాశం ఉన్నందున ఇది నెట్‌వర్క్ సమస్యలకు దారితీయవచ్చు.

హీట్ కాకూడదంటే..

నగదు, కార్డ్‌ల వంటి వాటిని ఫోన్ వెనక ఉంచకండి. వాటి కోసం ప్రత్యేక వాలెట్ లేదా కార్డ్ హోల్డర్‌ని ఉపయోగించండి. కొన్ని సమయాల్లో ఫోన్ చాలా వేగంతో హీటెక్కుతున్నట్లు అనిపించినప్పుడు ఫోన్ కవర్‌ని తీసివేయవచ్చు. ఇంటర్నెట్‌ని ఆఫ్ చేయవచ్చు.ఫోన్‌ని స్వీచ్ ఆఫ్ చేసి 10 నిమిషాలయ్యాక తిరిగి ఉపయోగించండి. ఇలా చేయడం ద్వారా ఫోన్ జీవిత కాలం పెరుగుతుంది.

For Latest News and National News click here..

Updated Date - Jun 03 , 2024 | 07:37 AM

Advertising
Advertising