ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YouTube: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. మీ వాయిస్, ఫేస్ ఉపయోగించి రూపొందించే ఏఐ వీడియోలపై ఫిర్యాదు చేయవచ్చు..

ABN, Publish Date - Jul 02 , 2024 | 12:12 PM

యూట్యూబ్ తన ప్రైవసీ పాలసీలను తాజాగా అప్‌డేట్ చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించే ఫేక్ వీడియోలను కట్టడి చేయడంపై యూట్యూబ్ సీరియస్‌గా దృష్టి సారించింది. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీల వాయిస్, ఫేస్‌ను ఉపయోగించి చాలా మంది ఫేక్ వీడియోలను రూపొందిస్తున్నారు.

Youtube

యూట్యూబ్ (YouTube) తన ప్రైవసీ పాలసీలను (privacy policy) తాజాగా అప్‌డేట్ చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించే ఫేక్ వీడియోలను కట్టడి చేయడంపై యూట్యూబ్ సీరియస్‌గా దృష్టి సారించింది. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీల వాయిస్, ఫేస్‌ను ఉపయోగించి చాలా మంది ఫేక్ వీడియోలను (Fake AI Videos) రూపొందిస్తున్నారు. వాటిని యూట్యూబ్ వంటి వేదికల ద్వారా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ ఫేక్ వీడియోల బారిన పడ్డారు.


ఇలాంటి ఫేక్ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించడం కష్టంగా మారింది. అయితే యూట్యూబ్ కొత్త పాలసీ ప్రకారం ఇకపై యూజర్లు అలాంటి ఫేక్ వీడియోలను ఫ్లాగ్ చేయవచ్చు. అంటే సదరు కంటెంట్‌పై యూట్యూబ్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు ఆ ఫేక్ వీడియోను రూపొందించిన వ్యక్తికి యూట్యూబ్ నుంచి వార్నింగ్ నోటీస్ వెళ్తుంది. ఆ నోటీస్ వచ్చిన 48 గంటల్లో ఆ ఫేక్ కంటెంట్‌ను తొలగిస్తే కేసు ఉండదు. లేకపోతే ఆ కేస్‌ను యూట్యూబ్ రివ్యూ చేస్తుంది. ఇలాంటి ఫేక్ ఏఐ వీడియోలను గుర్తించి తొలగించేందుకు యూట్యూబ్ చాలా కాలంగా రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది.

Updated Date - Jul 02 , 2024 | 12:12 PM

Advertising
Advertising