ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crime: అర్ధరాత్రి బాలికల హాస్టల్‌లోకి యువకుడు.. ఆ తరువాత ఏం చేశాడంటే

ABN, Publish Date - Oct 26 , 2024 | 06:31 PM

ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. బాలికలు ఉండే హాస్టళ్లలోకి దుండగులు చొరబడుతున్నారు. వసతి గృహాల్లో సరైన భద్రత చర్యలు లేవనేదానికి పలు ఘటనలు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి.

భూపాలపల్లి: ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. బాలికలు ఉండే హాస్టళ్లలోకి దుండగులు చొరబడుతున్నారు. వసతి గృహాల్లో సరైన భద్రత చర్యలు లేవనేదానికి పలు ఘటనలు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా భూపాలపల్లి జిల్లాలో ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండల కేంద్రంలోని బాలికల హాస్టల్‌లోకి.. శుక్రవారం రాత్రి ఓ యువకుడు చేతిలో కేక్ పట్టుకుని ప్రవేశించాడు. ఆ సమయంలో వసతి గృహం సెక్యూరిటీ, హాస్టల్ సిబ్బంది ఎవరూ లేకపోవడం గమనార్హం. యువకుడి రాకను గమనించిన బాలికలు అరిచారు.

అప్రమత్తమైన స్థానికులు హాస్టల్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే వారిని గమనించిన ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్‌లోకి ప్రవేశించడంపై బాలికలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పారు.


తాజా ఘటనతో హాస్టల్‌లో భద్రతపై తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హాస్టల్ వార్డెన్ సహా పలువురిని విచారిస్తున్నారు. బాలికల హాస్టల్‌కు రక్షణగా ఉండాల్సిన వారు ఎక్కడికి వెళ్లిపోయారని ఆరా తీస్తున్నారు. వారిపై చర్యలు తీసుకుంటామని, విద్యార్థినులు భయపడొద్దని ధైర్యం చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా.. హాస్టల్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవి కూడాచదవండి..

TG Police: పోలీసు, పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారిన అజ్ఞాత వ్యక్తి లేఖ..

Jaggareddy: అవును.. వాళ్లను తిట్టాను.. తప్పేంటి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 26 , 2024 | 06:31 PM