Kumaram Bheem Asifabad: ఘనంగా వసంత పంచమి వేడుకలు
ABN, Publish Date - Feb 14 , 2024 | 10:46 PM
ఆసిఫాబాద్ రూరల్, ఫిబ్రవరి 14: జిల్లాకేంద్రంలోని ఆలయాల్లో బుధవారం వసంతపంచమిని ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా శిశుమందిర్ పాఠశాలలో సర స్వతీమాత పూజ నిర్వహించి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు.
ఆసిఫాబాద్ రూరల్, ఫిబ్రవరి 14: జిల్లా కేంద్రంలోని ఆలయాల్లో బుధవారం వసంత పంచమిని ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా శిశుమందిర్ పాఠశాలలో సరస్వతి మాత పూజ నిర్వహించి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వర్ రావు, పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాయి బాబా ఆలయంలో, బాలేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఇక కాగజ్‌నగర్ పట్టణంలోని పలుపాఠశాలల్లో సరస్వతీ దేవికి పూజలు, హోమాలను చేశారు. చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, సతీమణి డాక్టర్ అనిత, శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల కమిటీ చైర్మన్ డాక్టర్ దామోదర్, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభాగ్ రంగస్వామి, ఆయా పాఠశాలల కరస్పాండెంట్‌లు పాల్గొన్నారు.
జైనూర్ మండల కేంద్రంలోని భారతీ గ్రామర్‌పాఠశాలలో జ్ఞాన సరస్వతీ మాతకు ఉపాధ్యాయులు పూజలు చేశారు. విద్యార్థులతో ఓనమాలు దిద్దించారు. కరస్పాండెంట్ పొలిపెల్లి నరేందర్, ప్రిన్సిపాల్ శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పెంచికలపేట: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను గర్భిణులు, పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని పోషన్ అభియాన్ ప్రాజెక్టు టెక్నికల్ అధికారి ప్రవీణ్ అన్నారు. మండలకేంద్రంలోని ఎల్కపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో బుధ వారం పిల్లలకు అక్షరాభ్యాసన కార్యక్రమం నిర్వహించారు. కార్య క్రమంలో ఎంపీడీవో రమేష్ ఉన్నారు.
Updated Date - Feb 15 , 2024 | 01:32 PM