అందోల్‌లో వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పాలు!
ABN, Publish Date - Mar 10 , 2024 | 03:42 AM
సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని రంగనాయకసాగర్ (అందోల్ పెద్దచెరువు) కట్టపైనున్న శిల్పాలు దాదాపు వెయ్యేళ్ల కిందటివని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని నాగిరెడ్డి తెలిపారు.
అవి 9-11 శతాబ్దాల మధ్య నాటివి: ఈమని నాగిరెడ్డి
జోగిపేట, మార్చి 9: సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని రంగనాయకసాగర్ (అందోల్ పెద్దచెరువు) కట్టపైనున్న శిల్పాలు దాదాపు వెయ్యేళ్ల కిందటివని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని నాగిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఈ శిల్పాలను పరిశీలించారు. అందోల్‌లోని శ్రీరంగనాథాలయం గోపురం ముందున్న మహిషాసుర మర్దిని తదితర శిల్పాలు.. రాష్ట్రకూటులు, కల్యాణి చాళుక్యుల హయాం క్రీస్తుశకం 9-11 శతాబ్దాల మధ్య చెక్కినవని వెల్లడించారు.
కనుమరుగవుతున్న చరిత్ర..
ఉమ్మడి మెదక్ జిల్లాలో అందోల్‌కి ప్రత్యేక చరిత్ర ఉంది. అందోల్ కేంద్రంగా రాణి శంకరమ్మ పాలించినట్లు చరిత్ర చెబుతోంది. ఆమె పాలనలో అందోల్ సంస్థానాన్ని శత్రువుల నుంచి కాపాడేందుకు శత్రుదుర్భేద్యమైన కోట బురుజులు నిర్మించారు. ప్రస్తుతం వాటిల్లో దాదాపు అన్ని కనుమరుగయ్యాయి. అందోల్ చరిత్ర ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుడు ఈ ప్రాంతాన్ని సామంత రాజ్యంగా పాలించాడు. దేశాయిని తన సామంతరాజుగా నియమించుకుని ఈ కోటలను వారి కాలంలో నిర్మించారు. అప్పటి రాజుల పాలనకు ఇవి చారిత్రక ఆనవాలుగా నిలుస్తున్నాయి.
Updated Date - Mar 10 , 2024 | 03:57 PM