ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్

ABN, Publish Date - Jan 06 , 2024 | 02:07 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ ఈ రోజు రాత్రి 7 గంటలకు ఏబీఎన్ న్యూస్ ఛానల్‌లో జరగనుంది. ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ డిబేట్ ఏబీఎన్ ఛానల్‌కు ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ (RadhaKrishna) బిగ్ డిబేట్ ఈ రోజు రాత్రి 7 గంటలకు ఏబీఎన్ న్యూస్ ఛానల్‌లో జరగనుంది. ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ డిబేట్ ఏబీఎన్ ఛానల్‌కు ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ లభించి, అధికారం చేపట్టింది. కాంగ్రెస్ విజయానికి గల కారణాలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాధాకృష్ణతో ముఖాముఖిలో వెల్లడిస్తారు. అధికారం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముందు సవాళ్లు ఉన్నాయి. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణం అమలవుతోంది. మిగిలిన గ్యారంటీలను అమలు చేయాల్సి ఉంది. వంద రోజుల్లో అమలు చేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు.. మరి సీనియర్ల నుంచి సీఎం రేవంత్ రెడ్డికి ఏ మేరకు సహకారం అందుతుంది. కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్‌ ముందు విన్నపాలు ఉంచారు. రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం తొలి రోజు నుంచే మాటల యుద్దానికి దిగింది. కేంద్రంలో మోదీ- రాష్ట్రంలో కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్ (CM Revanth) ఎలాంటి వ్యూహాం అనుసరించనున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులపై చర్యలు తీసుకుంటారా..? కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు జరిపిస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నింటికీ సమాధానమే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో బిగ్ డిబేట్. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఏబీఎన్ న్యూస్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. తప్పక చూడండి.

Updated Date - Jan 06 , 2024 | 02:08 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising