ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth Reddy : 400 ఎలా వస్తాయి!?

ABN, Publish Date - May 28 , 2024 | 06:19 AM

‘‘లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి దక్షిణాది రాష్ట్రాలు వందకుపైగా సీట్లు ఇవ్వనున్నాయి. దక్షిణాదిలో మొత్తం 121 సీట్లు ఉంటే.. కేరళ, తమిళనాడుల్లో బీజేపీకి చోటే లేదు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆ పార్టీకి వచ్చే సీట్లు 20 కంటే తక్కువే. గత ఎన్నికల్లో బీజేపీకి గుజరాత్‌, హరియాణా, ఢిల్లీ, రాజస్థాన్‌లలో మొత్తం సీట్లు వచ్చాయి. ఈసారి ఆయా

దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చేది 20 సీట్ల కంటే తక్కువే

గుజరాత్‌, హరియాణా, ఢిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఈసారి సగం కూడా కష్టమే

పాకిస్థాన్‌లోనూ పోటీ చేస్తేనే 400 వచ్చేది

రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దుకే 400

ప్రధాని హోదాలో దేశంలోని కొంతమందికి

వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదు

కేరళలో పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘‘లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి దక్షిణాది రాష్ట్రాలు వందకుపైగా సీట్లు ఇవ్వనున్నాయి. దక్షిణాదిలో మొత్తం 121 సీట్లు ఉంటే.. కేరళ, తమిళనాడుల్లో బీజేపీకి చోటే లేదు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆ పార్టీకి వచ్చే సీట్లు 20 కంటే తక్కువే. గత ఎన్నికల్లో బీజేపీకి గుజరాత్‌, హరియాణా, ఢిల్లీ, రాజస్థాన్‌లలో మొత్తం సీట్లు వచ్చాయి. ఈసారి ఆయా రాష్ట్రాల్లో సగం సీట్లు కూడా రావు. మరి, ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో 400 సీట్లు ఇంకెక్కడి నుంచి వస్తాయి!?’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు కోరుకున్నట్లు 400 సీట్లు కావాలంటే పాకిస్థాన్‌ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని ఎద్దేవా చేశారు. మోదీకి ప్రజలు రెండు సార్లు అధికారం ఇస్తే.. ఆయన వారిని మోసం చేశారని, దేశ ప్రజలంతా ఒక్కటై ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారని తేల్చి చెప్పారు. సయ్యద్‌ సాదిక్‌ అలీ షిహాబ్‌ తంగల్‌ రాసిన ‘స్నేహ సదస్సు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం కేరళలోని కొజికోడ్‌లో ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌ రెడ్డి.. స్నేహ సదస్సు పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో మతతత్వ శక్తులు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు, రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు ప్రమాదకరమన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో మతతత్వ శక్తులు 400 సీట్లు అడిగేది రాజ్యాంగాన్ని మార్చి.. రిజర్వేషన్లను రద్దు చేసేందుకే. అందరమూ కలిసి మతతత్వ శక్తులను ఓడించి.. రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలి. మతతత్వ శక్తులను కేరళ ప్రజలు వారి రాష్ట్రంలోకి అనుమతించరు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారితో కలిసి ఈ వేదిక పంచుకుంటున్నందుకు గర్వపడుతున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఒక విషయంలో కేరళను చూస్తే ఈర్ష్య కూడా కలుగుతుందని, రాహుల్‌ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించేందుకు ఎంతగానో ప్రయత్నించానని, కానీ, కేరళ తన కుటుంబమని, తాను ఈసారీ వయనాడ్‌ నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారని వివరించారు. ఐయూఎంఎల్‌ గత 48 ఏళ్లుగా కాంగ్రె్‌సతో కలిసి నడుస్తోందని, ఇండియా కూటమికి కేరళ యూడీఎఫ్‌ రోల్‌ మోడల్‌ అని చెప్పారు. ప్రేమ వీధిలో మతతత్వ శక్తులు విద్వేష దుకాణాన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో స్నేహ సదస్సు వంటి పుస్తకాన్ని రాసిన తంగల్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. దేశాన్ని, సంస్కృతిని, తర్వాతి తరాలను కాపాడుకునేందుకు మతతత్వ శక్తులతో కేరళ ప్రజలు చేస్తున్న పోరాటం నుంచి తానూ ఎంతో కొంత నేర్చుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు. ‘‘దేశ ప్రధాని హోదాలో ప్రజలందరి ప్రయోజనాలను కాపాడడం, వివిధ మతాలకు చెందిన వారందరినీ కలుపుకొని పోతూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం మోదీ బాధ్యత. గడిచిన పదేళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న ఆయన.. దేశంలోని కొంత మందికి వ్యతిరేకంగా మాట్లాడడం దేశానికి మంచిది కాదు’’ అని తప్పుబట్టారు. మతతత్వ శక్తులను చొప్పించేందుకు బీజేపీ ఎంత ప్రయత్నించినా వారికి ఒక్క ఇంచు కూడా జాగా ఇవ్వని కేరళ సమాజం.. హిందుస్థాన్‌కు రోల్‌ మోడల్‌ అని అన్నారు. కేరళ సిస్టం నుంచి దేశం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. కేరళ మోడల్‌ పాలిటిక్స్‌ దేశానికి చాలా అవసరమన్నారు.


నెహ్రూకు సీఎం రేవంత్‌ నివాళి

దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 60వ వర్ధంతి సందర్భంగా సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, పార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2024 | 06:20 AM

Advertising
Advertising