ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాలమూరుపై స్పష్టతేదీ?

ABN, Publish Date - Oct 24 , 2024 | 11:34 PM

Clarity on Palamuru? సాగు, తాగునీటి అవసరాల కోసం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నేటికీ పూర్తిస్థాయిలో స్పష్టత కరువైంది.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు టన్నెల్‌

- ఈ ఏడాది ప్రాజెక్టు ద్వారా కృష్ణానది

వరద జలాల వినియోగం లేనట్టేనా?

- మూడు మోటార్లు సిద్ధంగా ఉన్నా

నీటి విడుదలకు తొలగని ఆటంకాలు

- రెండు టీఎంసీల నీటి ఎత్తిపోతతో

చేతులు దులుపుకున్న గత ప్రభుత్వం

కొల్లాపూర్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : సాగు, తాగునీటి అవసరాల కోసం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నేటికీ పూర్తిస్థాయిలో స్పష్టత కరువైంది. ప్రాజెక్టు ప్యాకేజీ-1లో భాగమైన నార్లాపూర్‌ పంపుహౌజ్‌, ప్యాకేజీ-2లో ఉన్న 6.40 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న అంజనగిరి రిజర్వాయర్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌, రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డిలు ఇటీవలే క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అయినా పనుల్లో పురోగతి కని పించడంలేదు. ఈ వర్షాకాలంలో ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలపై అయో మయ పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది సెప్టెంబరు 16న ప్యాకేజీ-1లో ఉన్న నార్ల పూర్‌ పంపుహౌజ్‌లో 145 మెగావాట్ల ఒక పంపు మోటారు ద్వారా ఎత్తి పోతలను ప్రారంభించారు. అప్పట్లో రెండు టీఎంసీల నీటిని అంజనగిరి రిజర్వా యర్‌కు ఎత్తి పోసి నిల్వ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లో ప్రా జెక్టు పనుల్లో ప్రధాన భాగమైన నార్లాపూర్‌ పంపుహౌజ్‌లో రెండు, మూడో మోటారు పనులు దాదాపు పూర్తైన నీటిని ఎత్తిపోయడంలో అధికారులు విఫలమయ్యారు. ఎల్లూరు రెగుమాన్‌గడ్డ తీరం లో నిల్వ ఉండే వరద జలాలను ఎత్తి పోసి అంజనగిరి జలాశయం, ఏదుల జలా శయం, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్‌ జలాశయాలకు నీరు నింపాల్సి ఉంది. ప్రాజెక్టులో ప్రధాన భాగమైన నార్లపూర్‌ పంపుహౌజ్‌లో మొత్తం తొమ్మిది మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా అందులో గతేడాది ఒక్క మోటారును ప్రారంభి ంచారు. అంజనగిరి రిజర్వాయర్‌కు రెం డు టీఎంసీల నీటిని ఎత్తిపోసి నిల్వ చేశారు. ఈ ఏడాది రెండు, మూడో మోటార్లు కూడా సిద్ధ మయ్యాయి. నాలుగో మోటారు పనులు కొన సాగుతున్నాయి. ఇప్పటికే మూడు మోటా ర్లు సిద్ధంగా ఉన్నా అంజనగిరి రిజర్వాయర్‌కు నీటి ని ఎత్తిపోయడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రద ర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు లక్ష్యం..

శ్రీశైలం ప్రాజెక్టు తిరుగు వరద జలాల ఆధారంగా 60 రోజుల్లో 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేయాలని, ఈ జిల్లాల్లోని 70 మండలాల్లో 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగు నీటితో పాటు పరిశ్రమలకు నీరందించాలనే ఉద్దేశంతో పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టు పథకాన్ని ప్రారంభించారు. 2015లో రూ.35,200కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించినా దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రాజెక్టులో ప్రధాన భాగమైన ప్యాకే జీ-1లో ఉన్న నార్లపూర్‌ పంపుహౌజ్‌లోని ఒక్క మోటారును గత ప్రభుత్వం ఆన్‌ చేసి రెండు టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయగ లిగింది. నార్లపూర్‌ పంపుహౌజ్‌లో మొత్తం ఎనిమిది మోటార్లకు గాను ఒకటి అదనంగా ఉంటుంది. ఒక్కో మోటారు 85 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తాయి. ప్రస్తుతం మూడు మోటార్లు నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నా శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణానది తిరుగు జలాలను వినియోగిం చుకోవడం లేదు. కాంగ్రెస్‌ ప్రభు త్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు రంగారె డ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.1,285 కోట్లు కేటాయించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజె క్టు ప్యాకేజీ-2లో ఉన్న అంజనగిరి జలాశయం పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్యాకేజీ-3లో నార్లపూర్‌ జలాశయం నుంచి ప్యాకేజీ-4లో ఉ న్న సొరంగం మార్గం పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ప్యాకేజీ-6లో ఏదుల జలాశయం నుంచి ప్యాకేజీ-7వరకు ఉన్న కాల్వ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. కొల్లాపూర్‌ మండ లంలో ఉన్న కుడికిళ్ల, తీర్నాంపల్లి వైపు కాల్వ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అదేవిధంగా ఏదుల జలాశయం ప్రాంతం సొరంగం పనులు పూర్తి కావాల్సి ఉంది. దీంతో నార్లపూర్‌ పంపు హౌజ్‌ నుంచి నీటిని ఎత్తిపోసిన ఏదుల జలాశ యానికి సాగు, తాగునీటిని తరలించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో రూ.వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం అంజనగిరి రిజర్వాయర్‌కు మాత్రమే నీటిని ఎత్తిపోసే పరిస్థితి ఉన్న అధికారులు వాటిని కూడా వినియోగించుకోక పోవడంపై పాలమూ రు రంగారెడ్డి ప్రాజెక్టు ఎన్నడూ పూర్తవుతుం దోనని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Updated Date - Oct 24 , 2024 | 11:34 PM