ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth Reddy: ఆ టెండర్లలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

ABN, Publish Date - Feb 28 , 2024 | 07:40 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్‌పై హెచ్ఎండీఏ (HMDA) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road - ORR) లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్‌పై హెచ్ఎండీఏ (HMDA) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road - ORR) లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని HMDA పరిధిలోకి తీసుకురావాలని చెప్పారు. ORR నుంచి RRRకు అనుసంధానంగా.. రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా.. విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలని తెలిపారు.


ఇదే సమయంలో.. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ విషయంలో ఎక్కువ ఆలస్యం చేయకుండా.. వీలైనంత వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి (Amrapali) సూచించారు. సీబీఐ లేదా అదే స్థాయి దర్యాప్తు సంస్థకు రిపోర్ట్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని యోచిస్తున్నట్టు తెలిసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 28 , 2024 | 07:42 PM

Advertising
Advertising