ధాన్యం కొనుగోళ్లకు సహకరించాలి
ABN, Publish Date - Nov 02 , 2024 | 11:10 PM
జిల్లాలోని రైస్ మిల్లర్లు వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సహకరించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.
- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైస్ మిల్లర్లు వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సహకరించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి ధాన్యం కేటా యింపు, బ్యాంకు గ్యారంటీ గురించి వివరిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కేటాయి ంపు చేసేందుకు బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్ పౌరసరఫరాల శాఖ డీఎంకు సమర్పి ంచాలని సూచించారు. ప్రభుత్వం పాలసీ నిర్ణ యించి జీవో నెంబర్ 27 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం మిల్లర్ల సంక్షేమం దృష్ట్యా మిల్లింగ్ చార్జీలను సన్నరకం కు 40 శాతం, దొడ్డురకంకు 30 శాతం పెంచిన ట్లు తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వ ధాన్యం 50 శాతం మిల్లింగ్ అయిన తర్వాతే ప్రైవేట్ ధాన్యం 50 శాతం మిల్లింగ్ చేసేందుకు అనుమతి ఇస్తు ందన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 25 జారీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో రెవె న్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అఽధికారి వెంకటేష్, డీఎం విక్రమ్, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 02 , 2024 | 11:10 PM