ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CPI Narayana: అయోధ్య రామాలయం ఎన్నికల స్టంట్.. ‘ఇండియా’ని బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రలు

ABN, Publish Date - Jan 28 , 2024 | 08:22 PM

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కక్కిన కూడును తినేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆశపడ్డాడని మండిపడ్డ ఆయన.. ‘ఇండియా’ కూటమిని బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కక్కిన కూడును తినేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆశపడ్డాడని మండిపడ్డ ఆయన.. ‘ఇండియా’ కూటమిని బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అయోధ్య రామాలయం ఒక ఎన్నికల స్టంట్ అని.. తమ ఎన్నికల ప్రచారానికి ఆ ఆలయాన్ని బ్రాండ్ అంబాసిడర్‌గా బీజీపీ వినియోగించుకుంటుందని వ్యాఖ్యానించారు. ఇంటింటికీ రాముడి అక్షింతలు పంపించి లబ్ది పొందాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు.

తీర్పులు చెప్పే న్యాయ మూర్తులు సైతం అయోధ్యకు వెళ్లారని.. అందరినీ అయోధ్యకు రమ్మని ఆహ్వానించారని.. కానీ ఎల్‌కే అద్వానిని మాత్రం రావొద్దని ఆహ్వానం పంపారని నారాయణ పేర్కొన్నారు. న్యాయస్థానాలు, విచారణ సంస్థలు బీజేపీ గుప్పెట్లో ఉన్నాయని నారాయణ ఆరోపణలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఇప్పటి నుంచే రాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడగటం మొదలుపెట్టిందని అన్నారు. మోదీ పదేళ్ల పాలనలో పబ్లిక్ సెక్టార్‌లు అమ్మడం తప్ప.. కొత్తగా స్థాపించినవి లేవని దుయ్యబట్టారు. భారతదేశం హిందు దేశం కాదని.. ఇక్కడ అన్ని మతాల వారు ఉన్నారని ఉద్ఘాటించారు. అన్ని మతాలు, అన్ని వర్గాలు ఏకమై.. స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నారని చెప్పారు.


కాంగ్రెస్ పార్టీలో సమస్యలు ఉన్నాయని.. వాటిని సరిదిద్దుకుని ముందుకు రావాల్సిన అవసరం ఉందని.. తెలంగాణలో కలుపుకుని పోవడం వల్లే కాంగ్రెస్ విజయం సాధించిందని నారాయణ అభిప్రాయపడ్డారు. కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీజేపీకి చంద్రబాబు భయపడుతున్నారని, రేవంత్ రెడ్డికి ఉన్న దైర్యం కూడా ఆయనకు లేకపోవడం బాధాకరమని అన్నారు. బీఆర్ఎస్ ఓటమి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. కాంగ్రెస్ పరిపాలన ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో ఐదు ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. కేటీఆర్ తానే ముఖ్యమంత్రిననే భావనలో ఉండి మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఇదే సమయంలో.. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్టు నారాయణ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాజకీయ పరిస్థితులు పరిగణనలోకి తీసుకొని చర్చిస్తామని తెలిపారు. దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని చెప్పుకొచ్చారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసి, ఓటు బ్యాంక్ పెంచుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి.. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి లాభపొందాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు.

Updated Date - Jan 28 , 2024 | 08:22 PM

Advertising
Advertising