ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మధుమేహ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయాలి

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:31 PM

Diabetes diagnosis tests should be expedited జిల్లా లో 30 ఏళ్ల వయసు దాటిన ప్ర తీ ఒక్కరికి ఉచిత మధుమేహ ప రీక్షలు చేసే కార్యక్రమాన్ని మరిం త వేగం పెంచాలని కలెక్టర్‌ ఆద ర్శ్‌ సురభి వైద్యాధికారులకు ఆదే శించారు.

వైద్యాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, నవం బరు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లా లో 30 ఏళ్ల వయసు దాటిన ప్ర తీ ఒక్కరికి ఉచిత మధుమేహ ప రీక్షలు చేసే కార్యక్రమాన్ని మరిం త వేగం పెంచాలని కలెక్టర్‌ ఆద ర్శ్‌ సురభి వైద్యాధికారులకు ఆదే శించారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో వైద్య శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరుగుతు న్న మధుమేహ పరీక్షల నిర్వహణ కార్యక్రమాన్ని మరిన్ని కేంద్రాలకు విస్తరించాలన్నారు. డిసెంబ ర్‌ చివరి నాటికి పేద, ధనిక అనే సంబంధం లేకుండా 30 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి మధుమేహ పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశిం చారు. గ్లూకో మీటర్‌ ద్వారా మధుమేహం పాజి టివ్‌ వచ్చిన వ్యక్తి నుంచి రక్త నమూనా సేక రించి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించాలని తెలిపారు. అక్టోబరు నెల లో జిల్లా వ్యాప్తంగా 713 ప్రసవాలు జరుగ గా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 491 ప్రసవాలు జరిగాయ ని వైద్యాధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 222 ప్రసవాలు జరిగినట్లు వివరిం చారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 75 శాతం సిజేరి యన్‌ ద్వారా ప్రసవాలు నిర్వహించినట్లు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్‌ ప్రభు త్వ ఆసుపత్రుల్లో సకల సదుపాయాలు కల్పించి నందున అన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని మెడి కల్‌ ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం ఆశా కార్యకర్తలకు వారి నిర్ణీత నమూనా దిన చర్య పుస్తకాలను అందజేశారు. సమావేశంలో జిల్లా వైద్య అధికారి జయచంద్ర మోహన్‌, సహాయ అధికారి బి.శ్రీనివాస్‌, ప్రోగాం ఆఫీసర్లు సాయి నాథ్‌రెడ్డి, డా.పరిమల, డా.కె. రామచంద్రరావు, డా.ఝాన్సీ, పీహెచ్‌సి మెడికల్‌ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

అంగీకార పత్రం ఇస్తేనే ధాన్యం కేటాయింపు

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయని, రైస్‌ మిల్లర్లు నిబంధనల అంగీకార పత్రం ఇస్తేనే ధాన్యం కేటాయిస్తామని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు. బుధవారం కలెక్టరే ట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతో కలిసి మిల్లర్లతో సమావేశం నిర్వ హించారు. పెండింగ్‌లోఉన్న సీఎంఆర్‌ అప్ప గింత విషయంలో నవంబర్‌ చివరి నాటికి ప్రభు త్వం గడువు పొడిగించినట్లు తెలిపారు. వేగంగా ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించాలని చెప్పారు. సమావేశంలో సివిల్‌ సప్లయ్‌ డీఎం ఇర్ఫాన్‌, సివిల్‌ సప్లయ్‌ అధికారి కాశీ విశ్వనాథ్‌, వ్యవసాయ అధికారి గోవిందు నాయక్‌, రైస్‌ మిల్లర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:31 PM