ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: డీకే అరుణ పోటీ చేసే స్థానంపై క్లారిటీ!.. నేడో, రేపో బీజేపీ రెండో జాబితా

ABN, Publish Date - Mar 12 , 2024 | 04:31 AM

ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం సోమవారం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్‌ షాతో పాటు తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ దీనికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా

వరంగల్‌ నుంచి కృష్ణ ప్రసాద్‌కు టికెట్‌

నేడో, రేపో బీజేపీ రెండో జాబితా ప్రకటన

నగేశ్‌, సైదిరెడ్డికి ఇవ్వొద్దంటూ వినతులు

న్యూఢిల్లీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం సోమవారం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్‌ షాతో పాటు తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ దీనికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ.. మిగిలిన స్థానాలకు సంబంధించి కూడా కోర్‌ కమిటీ సమావేశాలు పూర్తయ్యాయి. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు గాను తొలి జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో 8 స్థానాలకు అభ్యర్థులు ఇప్పటికే ఖరారైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మహబూబాబాద్‌ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, ఖమ్మం నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌, నల్లగొండ నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి నగేశ్‌ పేర్లు ఖరారయ్యాయి. ఇటు మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ, వరంగల్‌ నుంచి మాజీ ఐపీఎస్‌ అధికారి కృష్ణ ప్రసాద్‌ పేర్లు కూడా దాదాపుగా ఖరారైనట్టు తెలిసింది. మెదక్‌, పెద్దపల్లి విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. మంగళ లేదా బుధవారం ప్రకటించే రెండో జాబితాలో ఆయా అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశముంది.

ఆదిలాబాద్‌ లంబాడాలకే ఇవ్వాలి

ఆదిలాబాద్‌లో లంబాడా బంజారాలకు పార్లమెంటు ఎన్నికల్లో టికెట్‌ ఇస్తే గెలుస్తామని మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ అన్నారు. మాజీ ఎంపీ నగేశ్‌ బీజేపీలో చేరిక, లోక్‌సభ టికెట్‌ ఆయనకు ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో సోమవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, ఎంపీ లక్ష్మణ్‌ను ఆదిలాబాద్‌ నేతలు కలిశారు. జిల్లాలో ఉన్న పరిస్థితులను బంజారా నేతలు రమేశ్‌ రాథోడ్‌, రాథోడ్‌ బాపురావు వారికి వివరించారు. ఈ సందర్భంగా రమేశ్‌ రాథోడ్‌ మాట్లాడుతూ.. చాలా మంది నేతలు మోదీ పాలనను చూసి బీజేపీలో చేరుతున్నారని.. అయితే పార్టీలో మొదట్నుంచి పని చేస్తున్న వారికే టికెట్‌ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరామని చెప్పారు.

రాళ్ల దాడి చేయించిన వ్యక్తికి టికెట్‌ ఇవ్వొద్దు

ఆనాడు గిరిజనుల కోసం అప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో గిరిజన భరోసా యాత్ర చేపడితే తమపై శానంపూడి సైదిరెడ్డి రాళ్లదాడి, లాఠీచార్జీ చేయించాడని.. అతడికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్‌ ఇవ్వొద్దని నల్లగొండ జిల్లా బీజేపీ నేతలు పలువురు పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. శానంపూడికి టికెట్‌ ఖరారైందన్న ప్రచారం నేపథ్యంలో ఆ జిల్లా పార్టీ నేతలు పలువురు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలివచ్చారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీని కలిసి వినతిపత్రం అందజేశారు. అనేక అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడమే బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Mar 12 , 2024 | 08:00 AM

Advertising
Advertising