ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరోగ్యంగా ఉండే ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలి

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:29 PM

ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరు ఐదు నె లలకు ఒకసారి రక్తదానం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్‌ సూచించారు.

రక్తదానం చేస్తున్న ఎస్‌ఐలను అభినందిస్తున్న ఎస్పీ రావుల గిరిధర్‌

- ఎస్పీ రావుల గిరిధర్‌

వనపర్తి క్రైమ్‌, అక్టోబరు23 (ఆంధ్రజ్యోతి) : ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరు ఐదు నె లలకు ఒకసారి రక్తదానం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్‌ సూచించారు. బుధవా రం పోలీస్‌ అమరవీరుల సం స్మరణ వారోత్సవాలలో భా గంగా జిల్లా పోలీస్‌ కార్యాల యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సమాజం, దేశం, రేపటి తరాల భవిష్యత్‌ కోసం విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గు ర్తు చేశారు. వారి త్యాగ ఫలితమే మనం ప్రశా ంత వాతావరణంలో గడుపుతున్నామని చెప్పా రు. అనంతరం రక్తదానం చేసిన ఎస్‌ఐలు మం జునాథ్‌ రెడ్డి, యుగంధర్‌ రెడ్డి, నరేందర్‌, సురేష్‌, పలువురిని అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎంతో మంది రక్తం దొరకక ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తదానం చేస్తే ఆరో గ్యంగా ఉంటారని తెలిపారు. మొత్తం 123 యూనిట్ల రక్తం సేకరించిన ట్లు తెలిపారు. కార్య క్రమంలో అడిషనల్‌ ఎస్పీ రాందాస్‌ తెజావత్‌, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణ, శివకుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 11:29 PM