‘స్వదేశీ దర్శన్’ పనులకు అటవీశాఖ అభ్యంతరం
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:19 AM
నల్లమల ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మారుస్తామని పర్యాటక శాఖ మంతి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యే ల బృందంతో నల్లమలలో పర్యటించిన సంద ర్భంగా ఆయన ప్రకటించారు.
- నిలిచిన బీటీ రోడ్డు నిర్మాణం - వెనుదిరిగిన రూ.1.50 కోట్ల నిధులు
దోమలపెంట, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : నల్లమల ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మారుస్తామని పర్యాటక శాఖ మంతి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యే ల బృందంతో నల్లమలలో పర్యటించిన సంద ర్భంగా ఆయన ప్రకటించారు. నాలుగు సంవ త్సరాలుగా మల్లెలతీర్థం జలపాతం సందర్శ ననూ అటవీశాఖ అధికారులు నిలిపి వేశారు. పదేళ్లక్రితం నల్లమల ప్రాంతాన్ని పర్యాటకం గా అభివృద్ధి పరిచేందుకు కేం ద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా మల్లెల తీర్థం అభివృద్ధికి రూ.4.50 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో వటువర్లపల్లి నుంచి మల్లెల తీర్థం జళపాతం వరకు ఎని మిది కిలో మీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం తో పాటు వటువర్లపల్లి, సార్లపల్లి, కుడి చింతల బావి గ్రామాలలో సీసీరోడ్డు నిర్మా ణం చే యాల్సి ఉంది. ఒక వటువర్లపల్లిలో మా త్రమే సీసీ రోడ్డు నిర్మాణ పనులను తెలం గాణ టూరిజం శాఖ తరుపున చేశారు. సార్లపల్లి, కుడిచింతలబావి గ్రామాలలో సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు బీటీ రోడ్డును వేసేం దుకు అటవీశాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఆరేళ్లుగా పనులు నిలిచి పోయాయి. దీంతో రూ.1.50 కోట్ల నిధులు వెనుదిరిగాయి.
పర్యాటకంగా నల్లమల ప్రాం తం అభి వృద్ధి
చెందుతున్న తరుణంలో అటవీశాఖ అభ్యంతరాలతో నిధులు వెనుదిరుగుతు న్నా యి. నల్లమల ఊటిగా పేరు గాంచు తున్న మల్లెలతీర్థం జళపాతానికి రోజు రోజుకు పర్యాటకుల తాకిడి పెరిగినప్ప టికీ అటవీ శాఖ అభ్యంతరాలతో మల్లెల తీర్థం జళపాతం సందర్శనకు అనుమతి నిరాకరించారు. ఇటీవ ల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కొట్టుకు పోయింది. దీంతో రహదారి సక్రమంగా లేక వాహన దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నా రు. మల్లెల తీర్థం జలపాతం వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయిస్తా నని గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అమలుకు నోచు కోలేదు. ఇప్పటికై నా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎంపీ డాక్టర్ మల్లు రవి పర్యాటకాభివృద్ధికి కృషి చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించా లని వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతల బావి గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
బీటీ రోడ్డు నిర్మాణం చేయాలి
మల్లెలతీర్థం వెళ్లేందుకు బీటీ రోడ్డు వేయిస్తానని నాలుగేళ్ల కిందట బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి శ్రీనువాస్‌గౌడ్ హామీ ఇచ్చారు. కానీ నిధులు మంజూరు చేయలేదు. కాంగ్రెస్ పాలనలోనైనా ఎమ్మెల్యే కృషి చేయాలి. మట్టి రోడ్డుపై వాహనాలు తిరగడంతో దుమ్ము విపరీతంగా వస్తోంది. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. నాయకులు, అధికారులు స్పందించి బీటీరోడ్డు వేయించాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.
- చిగుర్ల మల్లికార్జున్, మాజీ సర్పంచ్, సార్లపల్లి
Updated Date - Oct 22 , 2024 | 12:19 AM