ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Somesh Kumar: సోమేశ్‌కుమార్ ఆస్తుల చిట్టాలో వెలుగులోకి కొత్త విషయాలు.. ప్లాన్ ప్రకారమే!

ABN, Publish Date - Jan 30 , 2024 | 08:21 PM

మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ఆస్తుల చిట్టాలో తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన యాచారంలో భూములు కొన్నట్టు తేలింది. ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని, 25 ఎకరాల భూములను అత్యంత తక్కువ రేటుకు తన భార్య డాగ్యన్ముద్ర పేరిట కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.

మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ఆస్తుల చిట్టాలో తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన యాచారంలో భూములు కొన్నట్టు తేలింది. ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని, 25 ఎకరాల భూములను అత్యంత తక్కువ రేటుకు తన భార్య డాగ్యన్ముద్ర పేరిట కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఎకరాకు రూ.3 కోట్లకు పైగా ఉన్న ఆ ప్రాంతంలో.. కేవలం రూ.2 లక్షలకే కొన్నారు. అయితే.. ధరణి పోర్టల్ వచ్చాక కొనుగోలు చేశారా? లేక అంతకుముందే కొన్నారా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ధరణి పోర్టల్‌లో ఈ భూమికి సంబంధించిన ఖాతా నం.5237గా ఉంది.


ఇదిలావుండగా.. 2018లో ఫార్మాసిటీ ప్రాంతం కొత్తపల్లిలో సోమేశ్ కుమార్ 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఎకరాకు కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లించి, నలుగురి దగ్గర నుంచి ఆ భూముల్ని ఆయన కొనుగోలు చేయడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. భూముల కొనుగోలులో క్విడ్ ప్రోకో జరిగినట్లు అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ స్థాయిలో భూ ఖాతాదారులు లేరు. మరి.. ధరణి పోర్టల్‌లో ఈ ఖాతా నంబరు ఏ విధంగా కేటాయించారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్‌సైట్‌లో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్‌ను పరిశీలిస్తే.. అందులో ఈ భూమి కొనుగోలు చేసిన ఆధారాలు కనిపించడం లేదు.

అయితే.. సోమేశ్‌కుమార్ మాత్రం తాను ఈ భూమిని ప్రభుత్వ నిబంధనలను అనుసరించే 2018లో కొన్నానని చెప్తున్నారు. తాను ప్రశాసన్ నగర్‌లో నిర్మించుకున్న గృహాన్ని విక్రయించి.. ఆరు సంవత్సరాల కిందే ఈ వ్యవసాయ భూమిని కొన్నట్లు తెలిపారు. ఈ భూమి కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నానని, ప్రభుత్వం కూడా తనకు లేఖ ద్వారా అనుమతి ఇచ్చిందని చెప్పారు. కానీ.. ఐఏఎస్​ అధికారులు సాధారణంగా వారి ఆస్తుల వివరాలు సర్వీస్​లో ఉన్నప్పుడు డీఓపీటీకి ఇవ్వాల్సి ఉంటుందని, సోమేశ్ కుమార్ ఆ వివరాలు ఇవ్వలేదని తేలింది.

Updated Date - Jan 30 , 2024 | 08:21 PM

Advertising
Advertising