ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీజేపీతో పొత్తున్నా.. ‘మల్కాజిగిరి’ మాదే

ABN, Publish Date - Feb 17 , 2024 | 03:59 AM

‘బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు ఉంటే.. మా పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ.. బండి సంజయ్‌ ఎందుకంటారు. ఆయనవి మాటలే తప్ప ఆయనతో అయ్యేది లేదు..

బండిసంజయ్‌తో అయ్యేదిలేదు.. పొయ్యేదిలేదు:మల్లారెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు ఉంటే.. మా పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ.. బండి సంజయ్‌ ఎందుకంటారు. ఆయనవి మాటలే తప్ప ఆయనతో అయ్యేది లేదు.. పొయ్యేది లేదు. బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తున్నా.. మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ మాదే’’ అని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్‌ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ భద్రంగా ఉందని పేర్కొన్నారు. ‘‘నా కుమారునికి టికెట్‌ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం తగదు. మా అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కుటుంబం వేరు. మా కుటుంబం వేరు. అందరినీ కలిపి కుటుంబం అని అనడం సరికాదు’’ అని అభిప్రాయపడ్డారు. అదే విధంగా తన వర్సిటీలలో అక్రమ కట్టడాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని, కావాలని తనపై కక్ష సాధించాలనుకుంటే ఏమీ చేయలేనని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 17 , 2024 | 03:59 AM

Advertising
Advertising