ఖరీఫ్ నుంచి ‘ఉచిత’ పంటల బీమా!
ABN, Publish Date - Mar 06 , 2024 | 04:27 AM
అన్నదాతలకు శుభవార్త..! రాష్ట్రంలో పంటల బీమా పథకం(క్రాప్ ఇన్సూరెన్స్) పథకం అమలుపై కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. వచ్చే ఖరీ్‌ఫ(వానాకాలం) సీజన్ నుంచి
రైతులు నయాపైసా చెల్లించక్కర్లేదు.. ప్రభుత్వమే మొత్తం చెల్లించాలని నిర్ణయం
8 రాష్ట్రంలో సాగయ్యే అన్ని పంటలకు
‘పీఎం- ఫసల్ బీమా యోజన’
రేవంత్‌రెడ్డి సర్కారు కీలక నిర్ణయం
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు శుభవార్త..! రాష్ట్రంలో పంటల బీమా పథకం(క్రాప్ ఇన్సూరెన్స్) పథకం అమలుపై కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. వచ్చే ఖరీ్‌ఫ(వానాకాలం) సీజన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ఉచిత పంటల బీమా’ పథకాన్ని అమలుచేయాలని రేవంత్‌రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రైతులపై నయాపైసా ఆర్థికభారం పడకుండా.. రాష్ట్ర సబ్సిడీతోపాటు రైతుల తరుపున ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించారు. 2020లో కేసీఆర్ హయాంలో ‘ప్రధానమంత్రి పంటల బీమా పథకం’ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే..! ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కారు ‘పీఎం-ఎ్‌ఫబీవై’ పథకంలో చేరటంతోపాటు.. పశ్చిమబెంగాల్ తరహాలో రైతుల ప్రీమియాన్ని కూడా భరించాలని నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి భారమే..!
2016లోనూ ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు రైతుల వాటా పోగా.. మిగిలిన సబ్సిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాయి. రైతుల వాటా వేర్వేరుగా ఉండేది. ఆహార ధాన్యాలు, నూనెగింజల పంటలకు ఖరీ్‌ఫలో 2ు, యాసంగిలో 1.5ు, ఉద్యాన, వార్షిక వాణిజ్య పంటలకు 5ు మేర రైతులు తమ వాటాగా చెల్లించేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన సబ్సిడీ వాటాను 30శాతానికి తగ్గించింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 70ు సబ్సిడీ ప్రీమియం, పంట, సీజన్‌తో సంబంధం లేకుండా రైతుల వాటాను చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వంపై సీజన్‌కు రూ.1,500 కోట్ల చొప్పున ఏటా రూ. 3 వేల కోట్ల మేర భారం పడుతుంది. పశ్చిమబెంగాల్ ‘బంగ్లా సస్య బీమా యోజన’ పేరుతో సొంతంగా పథకాన్ని అమలు చేస్తోంది. మొత్తం ప్రీమియాన్ని సర్కారే చెల్లిస్తోంది. ఇప్పుడు రేవంత్ ప్రభు త్వం కూడా రాష్ట్ర రైతులకు పశ్చిమ బెంగాల్ తరహాలో వెసులుబాటు కల్పించనుందని వ్యసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఐదెకరాల్లోపు భూములు ఉన్నవారికి ఉచిత ప్రీమియం చెల్లించాలని రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మాత్రం భూమిపై ఎలాంటి పరిమితి లేకుండా బీమాకు సిద్ధమైనట్లు తుమ్మల వివరించారు. ఈ పథకంలో ప్రతి రైతు భాగస్వామ్యమయ్యేలా చేస్తామన్నారు. ‘‘ఆటోమేషన్ ఆఫ్ యీల్డ్ ఎస్టిమేషన్ (ఎ్‌సటెక్) పద్ధతిలో వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన పేర్కొన్నారు.
అక్షరసత్యాలుగా ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు
గత ప్రభుత్వ హయాంలో పంటలబీమా పథకం అమలుచేయకపోవటంతో జరిగిన నష్టాలపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే..! కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. జనవరి 4ప ‘ఖరీఫ్ నుంచి పంటల బీమా!’, ఫిబ్రవరి 11న ‘పశ్చిమ బెంగాల్ తరహాలో పంటల బీమా!’ శీర్షికలతో ప్రచురించిన కథనాలు ఇప్పుడు అక్షర సత్యాలయ్యాయి.
Updated Date - Mar 06 , 2024 | 04:27 AM