ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు

ABN, Publish Date - Jan 13 , 2024 | 11:56 PM

మండలంలోని తమ్మరబండపాలెం గ్రామంలో స్వయంభూ శ్రీదేవళ్‌ బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలలో శనివారం కరవైగళ్‌ ఉత్సవం నిర్వహించారు.

హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డలో ఎదుర్కోళ్ల మహోత్సవం

కోదాడ రూరల్‌, జనవరి 13 : మండలంలోని తమ్మరబండపాలెం గ్రామంలో స్వయంభూ శ్రీదేవళ్‌ బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలలో శనివారం కరవైగళ్‌ ఉత్సవం నిర్వహించారు. దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాసం తిరుప్పావై ప్రవచనాలు దివ్యంగా సాగుతున్న నేపథ్యంలో ఉదయం 9 గంటలకు పాశురాల పఠనం, తాత్పర్యం, ప్రాశస్త్యం గురించి ప్రవచనం నిర్వహించారు. అనంతరం 10 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీవారి శ్రవణ నక్షత్ర యుక్త మాస కల్యాణం అత్యంత రమణీయంగా నిర్వహించారు. అనంతరం మహానివేదన, మంగళశాసనం, తీర్ధప్రసాద వినియోగం జరిగింది. కార్యక్రమంలో అశేషసంఖ్యలో భక్తులు, ఆలయ అర్చకులు, చైర్మన శ్రీమాన ముడుంబై వేణుగోపాలాచార్యులు, ఆయన కుమారులు నారాయణాచార్యులు, స్థానాచార్యులు, మాసకల్యాణ నిర్వాహకులు తిరుప్పావై ప్రవచన కర్తలు లక్ష్మణాచార్యులు, ముడుంబై శ్రీనివాసాచార్యులు, ముడుంబై రామలక్ష్మణాచార్యులు, దేవాలయ ఈవో టీవీ చలపతి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

హుజూర్‌నగర్‌ : మండలంలోని బూరుగడ్డ గ్రామంలో శనివారం ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవికి మహిళలు 28వ పాశుర పఠన, తాత్పర్యం నిర్వహించారు. అనంతరం మంజరీ ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో లక్ష్మణ్‌రావు, గండు సైదులు, హరీష్‌, శ్రీనివాసాచార్యులు, మధుసూధనాచార్యులు, పూర్ణ, కనకయ్య, లింగయ్య, అంజయ్య, లక్ష్మి, అరుణ, అంజమ్మ, సక్కుబాయి, కిరణ్‌, గోవిందరెడ్డి, రామస్వామి, రాగం లింగయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని రామాలయంలో శనివారం రాత్రి ఎదుర్కోళ్లు కార్యక్రమాన్ని నిర్వహిం చారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2024 | 11:56 PM

Advertising
Advertising