ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KTR : ముఖ్యమంత్రి, మంత్రులను.. హరీశ్‌ ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు

ABN, Publish Date - Feb 13 , 2024 | 04:16 AM

శాసనసభలో తన అద్భుత ప్రసంగంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులందరినీ ఒంటి చేత్తో ఎదుర్కొన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కృష్ణా ప్రాజెక్టులు,

కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు: కేటీఆర్‌

హైదరాబాద్‌, పిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో తన అద్భుత ప్రసంగంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులందరినీ ఒంటి చేత్తో ఎదుర్కొన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో జరిగిన చర్చపై సోమవారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. కృష్ణా జలాలు కేఆర్‌ఎంబీకి సంబంధించి కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం, అబద్ధాలను హరీశ్‌ రావు తిప్పి కొట్టారన్నారు. బీఆర్‌ఎస్‌ నిర్వహించే చలో నల్లగొండ సభకు హరీశ్‌రావు సరైన టోన్‌ సెట్‌ చేశారని, కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని సభా వేదికగా కేసీఆర్‌ తనదైన శైలిలో ఎండగడతారని కేటీఆర్‌ వెల్లడించారు. శాసనసభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఇచ్చిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌(పీపీపీ)పై కేటీఆర్‌ స్పందించారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రజెంటేషన్‌ అంతా ఇంగ్లిషులోనే ఉందన్నారు. ఆయన తెలుగులో మాట్లాడకపోవడంతో.. ఆ ప్రజెంటేన్‌ తమకే అర్థం కాలేదని, ఇక తెలంగాణ ప్రజలకు ఏం అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 04:16 AM

Advertising
Advertising