ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రోడ్డు ప్రమాదంలో హోటల్‌ యజమాని మృతి

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:23 AM

నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉడిపి హోటల్‌ యజమాని మృతిచెందాడు.

దేవరకొండ, మార్చి 3: నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉడిపి హోటల్‌ యజమాని మృతిచెందాడు. దేవరకొండ సీఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ర్టానికి చెందిన అయ్యప్పస్వామి గురుస్వామి నారా యణస్వామి 30సంవత్సరాలుగా దేవరకొండలో ఉడిపి హోటల్‌ నడుపుతున్నాడు. ఆయన ఐదు సంవత్సరాల క్రితం శబరిలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందాడు. అనంతరం ఆయన కుమారుడు రాఘవేంద్రశెట్టి(43) దేవరకొండలో ఉడిపి హోటల్‌ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. శనివారం రాత్రి స్కూటి వాహనంపై ఉడిపి హోటల్‌ నుంచి కల్వకుర్తి రోడ్డువైపు వెళ్లి తిరిగి హోటల్‌కు చేరుకుంటుండగా కల్వకుర్తి నుంచి కొండమల్లేపల్లి వైపు వెళుతున్న బొలొరో వాహనం అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రాఘవేంద్రశెట్టి తలకు తీవ్రగాయాలు కాగా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. రాఘవేంద్రశెట్టికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య అశ్విని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

మరో ప్రమాదంలో యువకుడు

కట్టంగూరు: నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలోని అయిటిపాముల గ్రామ శివారులో చెరువుఅన్నారం క్రాస్‌ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఆది వారం రాత్రి జరిగిన ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఎస్‌ఐ ఎన్‌. శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. అయిటిపాముల గ్రామానికి చెందిన సున్నపు రాజశేఖర్‌(23) బైక్‌పై నకిరేకల్‌కు వెళ్లి తిరిగి అయిటిపాములకు వస్తుండగా నకిరేకల్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సిమెంట్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ లారీని అతివేగంగా నడిపి ముందుగా వెళ్లుతున్న బైక్‌ను ఢీకొంది. దీంతో రాజశేఖర్‌కు తలకు గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. రాజశేఖర్‌ సోదరుడు శివ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 04 , 2024 | 10:37 AM

Advertising
Advertising