ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Siri: సిరిని సెట్ చేసుకోలేకపోతున్నారా.. ఈ స్టెప్స్‌

ABN, Publish Date - May 27 , 2024 | 09:48 PM

ఐఫోన్ ఉన్న వారికి సిరి గురించి తెలియకుండా ఉంటుందా చెప్పండి. అయితే తొలిసారి ఐఫోన్ కొన్న యూజర్లకు సిరి టెక్నాలజీపై అవగాహన ఉండకపోవచ్చు. సిరి ఉంటే(Hey, Siri!) టెక్ట్సింగ్, కాలింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఇలా ఎన్నో పనులు నోటితో అయిపోతాయి.

ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్(iPhone) ఉన్న వారికి సిరి గురించి తెలియకుండా ఉంటుందా చెప్పండి. అయితే తొలిసారి ఐఫోన్ కొన్న యూజర్లకు సిరి టెక్నాలజీపై అవగాహన ఉండకపోవచ్చు. సిరి ఉంటే(Hey, Siri!) టెక్ట్సింగ్, కాలింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఇలా ఎన్నో పనులు నోటితో అయిపోతాయి. అయితే దీన్ని సెటప్ చేయడంలో కొందరు ఇబ్బంది పడుతుంటారు. సిరిని సెట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

  • ఐఫోన్లో సెట్టింగ్‌ ఆప్షన్‌ని క్లిక్ చేయండి

  • Siri and Searchపై క్లిక్ చేసి యాక్సెస్ చేయండి .

  • 'సిరి & సెర్చ్' పేజీ ఎగువన, "హే, సిరి కోసం వినండి"(Listen for Hey, Siri") అని లేబుల్ చేసిన స్విచ్ మీకు కనిపిస్తుంది.

  • ఆకుపచ్చగా మార్చడానికి స్విచ్‌పై నొక్కండి. తద్వారా ఫీచర్ ఎనేబుల్ అవుతుంది.


'హే సిరి' సెటప్‌ను ఎలా ప్రారంభించాలి..

  • సెటప్ ప్రక్రియ కోసం "కంటిన్యూ" అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

  • సిరి క్రమాంకనం(Calibrate Siri): మీ ఫోన్‌లో పదాలను పలకాలని సిరి సూచిస్తుంది. ఇది మీ వాయిస్‌ని అర్థం చేసుకోవడానికి, ప్రతిస్పందించడానికి పదాలు పలకమని సూచిస్తుంది. కాబట్టి ఇది కీలకం.

  • ఆన్-స్క్రీన్ సూచనలను అనుసరించండి. డిస్‌ప్లేపై వచ్చిన పదాలను పలకండి.

  • మీరు పదాలను చెప్పడం పూర్తి చేసిన తర్వాత "Done" ఆప్షన్‌పై నొక్కండి.

  • "హే సిరి" అప్పుడు సక్సెస్‌ఫుల్‌గా సెట్ అవుతుంది. దాన్ని మీ వాయిస్‌తో టెస్ట్ చేసి హ్యాప్పీగా సిరీని వాడేసుకోవచ్చు.

For Latest News and Technology News

Updated Date - May 27 , 2024 | 09:50 PM

Advertising
Advertising