ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆరు గ్యారెంటీలకు నిధులెలా తెస్తారు?

ABN, Publish Date - Mar 12 , 2024 | 04:19 AM

ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎలా సమకూర్చుకుంటారో కాంగ్రెస్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై మంగళవారం జరిగే క్యాబినెట్‌ సమావేశంలో స్పష్టత ఇవ్వాలన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..

సర్కారును నిలదీసిన బీజేపీ ఎమ్మెల్యే శంకర్‌

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎలా సమకూర్చుకుంటారో కాంగ్రెస్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై మంగళవారం జరిగే క్యాబినెట్‌ సమావేశంలో స్పష్టత ఇవ్వాలన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఈనెల 17వ తేదీ నాటికి వంద రోజులు పూర్తవుతుందని, తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేయకపోతే ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగబోమని నాడు రేవంత్‌ ప్రకటించారని గుర్తుచేశారు. ఎంపీ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి ఆరు గ్యారెంటీలను వాయిదా వేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్లకు సింహభాగం నిధులు కేంద్ర ప్రభుత్వానివేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ చెప్పారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఖర్చు చేయనున్నట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిందని.. అయితే ఇందులో రూ.4.50 లక్షలు కేంద్ర పథకాల సహకారంతో వస్తున్న నిధులేనని ప్రకటనలో వివరించారు.

Updated Date - Mar 12 , 2024 | 11:02 AM

Advertising
Advertising