ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: తప్పిపోయి గుజరాత్‌కు.. అక్కడి ఆశ్రమంలో నలుగురు మానసిక దివ్యాంగులు

ABN, Publish Date - Jan 02 , 2024 | 10:45 AM

తెలుగు రాష్ట్రాల్లో తప్పిపోయిన నలుగురు మానసిక దివ్యాంగులు గుజరాత్‌(Gujarat)లోని ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. అక్కడ పనిచేస్తున్న ఓ మహిళా తెలుగు జర్నలిస్టు చొరవతో విషయం హైదరాబాద్‌ సిటీ(Hyderabad City) మహిళా భద్రతా విభాగం అధికారులకు తెలిసింది.

- నగరానికి తీసుకొచ్చిన ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ బృందం

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో తప్పిపోయిన నలుగురు మానసిక దివ్యాంగులు గుజరాత్‌(Gujarat)లోని ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. అక్కడ పనిచేస్తున్న ఓ మహిళా తెలుగు జర్నలిస్టు చొరవతో విషయం హైదరాబాద్‌ సిటీ(Hyderabad City) మహిళా భద్రతా విభాగం అధికారులకు తెలిసింది. దాంతో సిటీ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి ఆదేశాలతో ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీసీపీ కవిత ధార పర్యవేక్షణలో యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి రంగంలోకి దిగారు. ప్రత్యేక టీమ్‌తో గుజరాత్‌కు వెళ్లి నలుగురు మానసిక మహిళా దివ్యాంగులను రక్షించి నగరానికి తెచ్చారు. నగరంలోని మరో స్వచ్చంద సంస్థ వారికి ఆశ్రయం కల్పించడానికి ముందుకు రావడంతో వారికి అప్పగించారు. ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీసీపీ కవిత తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణకు చెందిన 55 ఏళ్ల ఐశ్వర్య, ఏపీకి చెందిన 48 గోపు అలియాస్‌ లక్ష్మి, 41 ఏళ్ల స్వీటీ, 45 ఏళ్ల నూరాలు కొన్నేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల నుంచి తప్పిపోయారు. ఆ తర్వాత చివరకు గుజరాత్‌కు చేరారు. అక్కడ మానవ్‌జ్యోతి ఆశ్రమం నిర్వాహకులు గుర్తించి వారికి ఆశ్రయం కల్పించారు. అయితే ఇటీవల నగరానికి చెందిన సీనియర్‌ జర్నలిస్టు గీత గుజరాత్‌లోని ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు తెలుగులో మాట్లాడుతున్న నలుగురు మహిళలను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి దృష్టికి తెచ్చారు. దాంతో సీపీ ఆదేశాలతో ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీసీపీ కవిత ధార పర్యవేక్షణలో యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ తన బృందంతో గుజరాత్‌కు వెళ్లి వారిని నగరానికి తీసుకొచ్చారు. వారి బాగోగులు, భద్రత చూడటానికి సయోద్య హోమ్‌ ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ నీడ్‌ స్వచ్చంద సంస్థ వారు ముందుకొచ్చారు. దాంతో పోలీసులు నలుగరు మహిళలను వారి ఆశ్రమంలో అప్పగించారు.

Updated Date - Jan 02 , 2024 | 10:45 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising