ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Cadburry: చాక్లెట్లో పురుగులు.. స్పందించిన క్యాడ్‌బరీ సంస్థ.. ఏమందంటే

ABN, Publish Date - Feb 11 , 2024 | 01:08 PM

సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన చాక్లెట్లో పురుగులు రావడం ఓ కొనుగోలుదారుడిని విస్మయానికి గురి చేసింది. ఆగ్రహానికి గురైన బాధితుడు క్యాడ్‌బరీ సంస్థను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకున్నాడు.

హైదరాబాద్: సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన చాక్లెట్లో పురుగులు రావడం ఓ కొనుగోలుదారుడిని విస్మయానికి గురి చేసింది. ఆగ్రహానికి గురైన బాధితుడు క్యాడ్‌బరీ సంస్థను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన రాబిన్ అమీర్‌పేట్‌లోని ఓ సూపర్ మార్కెట్లో ఫిబ్రవరి 9న డెయిరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. దాన్ని ఇంటికి తీసుకువచ్చి ఓపెన్ చేసి చూడగా షాక్‌కి గురయ్యాడు.

ప్యాకెట్ ఓపెన్ చేయగానే అందులోంచి పురుగులు బయటకి వచ్చాయి. ఈ ఘటనతో ఆందోళనకు గురైన రాబిన్ చాక్లెట్‌లో పురుగులు పాకుతున్న దృశ్యాన్ని వీడియో తీసి ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. "అమీర్‌పేట్‌లోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగులు ఉండటాన్ని గమనించాను. గడువు ముగిసిన ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ ఉందా? ప్రజారోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు" అని రాబిన్ తన X అకౌంట్‌లో ప్రశ్నించాడు.


ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. క్షణాల్లో 85 వేల మంది ఈ పోస్ట్‌ని చూసి.. క్యాడ్‌బరీ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై దావా వేసి, పరిహారం పొందాలని ఒక యూజర్ సూచించగా, క్యాడ్‌బరీ బృందానికి విషయాన్ని చేరవేసి, దర్యాప్తు జరిగేలా చూడండి అని మరొకరు కామెంట్ చేశారు. ఈ సమస్యపై సంస్థ అధికారిక ఎక్స్ అకౌంట్ స్పందించింది. "వినియోగదారుడికి చెడు అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నాం. ఘటనపై దర్యాప్తు చేస్తాం. మరొసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం" అని పోస్ట్ చేసింది.

Updated Date - Feb 11 , 2024 | 01:08 PM

Advertising
Advertising