ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ఉప్పల్‌ వంతెనకు మోక్షం.. పనులు వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ

ABN, Publish Date - Feb 02 , 2024 | 11:46 AM

నగరంలోని ఉప్పల్‌- నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు వేగం పుంజుకోనున్నాయి. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) వినతిపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ(Union Minister Nitin Gadkari) సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఉప్పల్‌- నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు వేగం పుంజుకోనున్నాయి. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) వినతిపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ(Union Minister Nitin Gadkari) సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు పనులు వేగవంతంగా పూర్తిచేసేలా అధికారులను ఆదేశిస్తానని గడ్కరీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు 6.2 కిలోమీటర్ల మేర రూ.670 కోట్లతో నిర్మించతలపెట్టిన ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులకు 2018లో నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి వంతెన పనులు సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారిపై ఉప్పల్‌ నుంచి మేడిపల్లి వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. కేవలం కిలోమీటరు దూరానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుండడంతో వాహనదారులు నిత్యం నరకయాతన పడుతున్నారు. ఐదేళ్లుగా పనులు పూర్తి కావడం లేదని మంత్రి కోమటిరెడ్డి గురువారం నితిన్‌ గడ్కరీని కలిసి వివరించారు.

Updated Date - Feb 02 , 2024 | 11:46 AM

Advertising
Advertising