Hyderabad: చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు
ABN, Publish Date - Jan 18 , 2024 | 08:38 AM
హైదరాబాద్: చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇద్దరు కోర్టు కానిస్టేబుళ్లతో పాటు కోర్టు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక కేసు విషయంలో కానిస్టేబుల్ నిందితుని దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేశారు.
హైదరాబాద్: చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇద్దరు కోర్టు కానిస్టేబుళ్లతో పాటు కోర్టు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక కేసు విషయంలో కానిస్టేబుల్ నిందితుని దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు డబ్బులు ఇవ్వాలంటూ తనను వేధిస్తున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అర్ధరాత్రి చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో అధికారులు సోదాలు చేపట్టారు.
మరోవైపు రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్‌లోని హైదర్ షాకోట్‌లోని ఓ గ్యాస్ రీ ఫిలింగ్ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. అక్రమంగా గ్యాస్ రీ ఫిలింగ్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. డొమెస్టిక్ సిలిండర్స్ నుంచి అక్రమంగా చిన్న చిన్న సిలిండర్స్‌లో రీ ఫిలింగ్ చేస్తున్నారు. 100 డొమెస్టిక్ సిలిండర్స్‌ను సీజ్ చేసి.. నార్సింగీ పోలీసులకు అప్పగించారు.
Updated Date - Jan 18 , 2024 | 08:38 AM