ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: రేవంత్ పట్టుదలతో సీఎం అయ్యారు.. కాంగ్రెస్ సర్కార్‌కి సహకరిస్తామన్న అసదుద్దీన్

ABN, Publish Date - Mar 08 , 2024 | 09:06 PM

సీఎం రేవంత్ పట్టుదలతో ముఖ్యమంత్రి పదవిని సాధించారని ఎంపీ అసదుద్దీన్(Asaduddin Owaisi) అన్నారు. పాతబస్తీలో మెట్రో శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌(CM Revanth Reddy)తో పాటు ఎంపీ అసద్ పాల్గొన్నారు.

హైదరాబాద్: సీఎం రేవంత్ పట్టుదలతో ముఖ్యమంత్రి పదవిని సాధించారని ఎంపీ అసదుద్దీన్(Asaduddin Owaisi) అన్నారు. పాతబస్తీలో మెట్రో శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌(CM Revanth Reddy)తో పాటు ఎంపీ అసద్ పాల్గొన్నారు.

అనంతరం అసద్ మాట్లాడుతూ.. "సీఎం రేవంత్ ఎంతో పట్టుదల గల మనిషి. రాష్ట్ర ప్రజలు 5 ఏళ్లు అధికారంలో ఉండాలని కాంగ్రెస్‌కి పవర్ ఇచ్చారు. పాతబస్తీ అభివృద్ధిలో కాంగ్రెస్ సర్కార్‌తో కలిసొస్తాం. ప్రజలు సామరస్యంగా కలిసిమెలిసి ఉన్నారు. ఈ సహృద్బావ వాతావరణాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణలో కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయి. వాటిని అడ్డుకోవాలి. పాతబస్తీ అభివృద్ధికి నిధులు అడగ్గానే రూ.120 కోట్లు మంజూరు చేసినందుకు రేవంత్‌కు ధన్యవాదాలు. మూసీ నది ప్రక్షాళనకు ఎంఐఎం సహకరిస్తుంది. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలి. చంచల్ గూడ జైలును హైదరాబాద్ బయటకి తరలించి.. ప్రస్తుతం ఉన్న భవనంలో కేజీ టూ పీజీ విద్యాబోధన జరిగేలా చూడాలి" అని అసద్ కోరారు.

Updated Date - Mar 08 , 2024 | 09:18 PM

Advertising
Advertising