Hyderabad: రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే.. త్వరలో బీజేపీలోకి వెళ్తారన్న బాల్క సుమన్
ABN, Publish Date - Mar 09 , 2024 | 06:24 PM
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లోక్ సభ ఎన్నికల తరువాత బీజేపీలోకి వెళ్తారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని పెద్దన్న అన్నప్పుడే ఈ విషయంపై స్పష్టత వచ్చిందని ఆరోపించారు.
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లోక్ సభ ఎన్నికల తరువాత బీజేపీలోకి వెళ్తారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని పెద్దన్న అన్నప్పుడే ఈ విషయంపై స్పష్టత వచ్చిందని ఆరోపించారు.
హైదరాబాద్‌లో శనివారం బాల్క సుమన్ మాట్లాడుతూ.. "పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే , హేమంత్ బిశ్వశర్మ కావడం ఖాయం. బేగంపేట విమానాశ్రయంలో గురు శిష్యుల భేటీ రెండు గంటల పాటు జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు శిష్యుడు రేవంత్ ముఖ్యమంత్రి కాగానే.. రాష్ట్రంలో కరవు తాండవిస్తోంది. పొలాలు ఎండిపోయి.. రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రేవంత్‌ని బీజేపీలోకి పంపేందుకు బాబు సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యేలతో త్వరలోనే రేవంత్ బీజేపీలోకి వెళ్తారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్‌తో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించండి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే" అని సుమన్ సంచలన కామెంట్స్ చేశారు.
Updated Date - Mar 09 , 2024 | 06:27 PM