BRS: ప్రారంభమైన బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశం..
ABN, Publish Date - Jan 20 , 2024 | 01:01 PM
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు తదితరులు హాజరయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు తదితరులు హాజరయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట, సనత్ నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి ఉన్నాయి.
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో గోశామహల్,చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్‌పురా, యాకత్ పురా, మలక్ పేట, కార్వాన్ ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలతో సమీక్ష సమావేశం జరుగుతోంది. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. నాంపల్లి అసెంబ్లీ స్థానంలో ఎంఐఎం విజయం సాధించింది.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఆరు స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించింది. గోశామహల్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ గెలిచింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున తలసాని సాయికిరణ్ యాదవ్ పోటీ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో ఇప్పటి వరకూ బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహ రచన చేసింది.
Updated Date - Jan 20 , 2024 | 01:01 PM