బీరు సీసాలపై చేర్యాల నకాశీ చిత్రాలు
ABN, Publish Date - Jun 12 , 2024 | 05:19 AM
అరుదైన చిత్రకళగా, వారసత్వ సంపదగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చేర్యాల నకాశీ చిత్రాలను మద్యం సీసాలపై ముద్రించడంతో చిత్రకారులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో పోటీని తట్టుకునేందుకు గతంలో గ్రామదేవతల చరిత్రలు, ఇతిహాసాల వివరణతో పాటు బొమ్మల తయారీ, టీ షర్ట్‌లు, భోజన ప్లేట్లు, ఇతరాత్ర వస్తువులపై నకాశీ చిత్రాలను ముద్రించేవారు.
కర్జూర, 100పైపర్ బీర్‌బాటిళ్లపై చేర్యాల చిత్రకళ
ఆయా కంపెనీలతో కొందరు కళాకారుల ఒప్పందం
స్థానికులు, అభిమానుల మండిపాటు
చేర్యాల, జూన్ 11: అరుదైన చిత్రకళగా, వారసత్వ సంపదగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చేర్యాల నకాశీ చిత్రాలను మద్యం సీసాలపై ముద్రించడంతో చిత్రకారులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో పోటీని తట్టుకునేందుకు గతంలో గ్రామదేవతల చరిత్రలు, ఇతిహాసాల వివరణతో పాటు బొమ్మల తయారీ, టీ షర్ట్‌లు, భోజన ప్లేట్లు, ఇతరాత్ర వస్తువులపై నకాశీ చిత్రాలను ముద్రించేవారు. అయితే ఇప్పుడు కొత్తగా బీరు బాటిళ్లపై నకాశీ చిత్రాలను ముద్రించడానికి కర్జూర, 100 పైపర్ బ్రాండ్ కంపెనీలతో కొందరూ కళాకారులు ఒప్పందం చేసుకున్నారు. భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ ఉన్న అపురూప చిత్ర కళా లేబుల్ ముద్రణను సదరు కంపెనీలకు కళాకారులు అమ్ముకోవడంపై స్థానికులు, చిత్రకళా అభిమానులు మండిపడుతున్నారు.
Updated Date - Jun 12 , 2024 | 05:19 AM