CM Revanth Reddy: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న రేవంత్
ABN, Publish Date - Mar 08 , 2024 | 07:53 PM
భాగ్యనగర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా మార్గంలో మెట్రో రైలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్: భాగ్యనగర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా మార్గంలో మెట్రో రైలు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రేవంత్ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..
"పాతబస్తీ ఓల్డ్ సిటీ కాదు. ఒరిజినల్ హైదరాబాద్ సిటీ. పాతబస్తీకి వీలైనంత త్వరగా మెట్రోను తీసుకురావడానికి కృషి చేస్తాం. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. భాగ్యనగరానికి కృష్ణ, గోదావరి నీళ్ళు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చింది ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. 2050 వైబ్రెంట్ పేరుతో అభివృద్ధి చేస్తాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంని ఓడించాలని ప్రయత్నించాం. కానీ ఆ పార్టీ హైదరాబాద్ ప్రాంతంలో మళ్లీ తన పట్టు నిలుపుకుంది. రాజకీయాలు ఎన్నికల వరకే.. అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేస్తాం" అని రేవంత్ అన్నారు.
Updated Date - Mar 08 , 2024 | 07:56 PM