Hyderabad: చూస్తే చాక్లెట్లే.. ఓపెన్ చేస్తే నిండా డైమండ్స్.. ఎక్కడంటే..!
ABN, Publish Date - Jan 13 , 2024 | 04:15 PM
హైదరాబాద్, జనవరి 13: విదేశాల నుంచి డబ్బు, బంగారం, డ్రగ్స్ వంటి నిషేధిత వస్తువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు రోజు రోజుకు సరికొత్త ఐడియాలతో రెచ్చిపోతున్నారు. అధికారుల కళ్లుగప్పి.. స్మగ్లింగ్ కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 13: విదేశాల నుంచి డబ్బు, బంగారం, డ్రగ్స్ వంటి నిషేధిత వస్తువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు రోజు రోజుకు సరికొత్త ఐడియాలతో రెచ్చిపోతున్నారు. అధికారుల కళ్లుగప్పి.. స్మగ్లింగ్ కొనసాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు డీఆర్‌ఐ అధికారులు. ఈ వజ్రాల విలువ సుమారు రూ. 6 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇద్దరు ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ ఇద్దరు వ్యక్తులు.. చాకెట్ కవర్ లోపల భారీ స్థాయిలో డైమండ్స్ అమర్చారు. పైకి చూసేందుకు చాక్లెట్ మాదిరిగా ఉన్నా.. లోపల మాత్రం మొత్తం డైమండ్స్ ఏర్పాటు చేవారు. తనిఖీల సమయంలో ఈ ప్రయాణికు కదలికలు తేడాగా కనిపించడంతో తనిఖీ చేశారు డీఆర్ఐ అధికారులు. దీంతో.. వారిద్దరి వద్ద వెరైటీ చాక్లెట్ ప్యాకెట్స్ కనిపించాయి. వెంటనే వాటిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ప్యాకెట్స్ విప్పి చూశారు. ఆ ప్యాకెట్స్ నిండా డైమండ్స్ ఉన్నాయి. అవి అవాక్కైన అధికారులు.. డైమండ్స్‌ని అక్రమ రవాణా చేస్తున్న ప్రయాణికులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక స్వాధీనం చేసుకున్న వజ్రాల విలువ సుమారు రూ. 6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ముంబైలో రూ. 40 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం..
ముంబై అంతర్జాతీయ విమనాశ్రయంలో రూ. 40 కోట్ల విలువ చేసే కొకైన్‌ను పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ అడిస్ అబాబా నుంచి డ్రగ్స్ తీసుకువస్తున్నట్లు ముందే సమాచారం అందుకున్నారు అధికారులు. దాంతో అలర్ట్ అయిన డీఆర్ఐ ఆఫీసర్స్ ముంబై ఎయిర్‌పోర్టులో సదరు మహిళను తనిఖీ చేయగా.. భారీ మొత్తంలో కొకైన పట్టుబడింది. దీని విలువ రూ. 40 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు. థాయ్ మహిళపై కేసు నమోదు చేసిన అధికారులు.. విచారణ జరుపుతున్నారు.
Updated Date - Jan 13 , 2024 | 04:15 PM