Hyderabad: ఖాళీగా దర్శనమిస్తున్న భాగ్యనగర రోడ్లు
ABN, Publish Date - Jan 15 , 2024 | 11:56 AM
Telangana: భాగ్యనగరం బోసిపోయింది. నగర రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని నగరవాసులు సొంతూళ్లకు తరలి వెళ్లారు.
హైదరాబాద్, జనవరి 15: భాగ్యనగరం బోసిపోయింది. నగర రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి పండగను పురస్కరించుకుని నగరవాసులు సొంతూళ్లకు తరలి వెళ్లారు. దీంతో భాగ్యనగరం ఖాళీగా కనిపిస్తోంది. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. ఐటీ కారిడార్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, అమీర్ పేట్ ప్రధాన జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ భారీగా తగ్గింది.
మరోవైపు సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీఎస్సార్టీసీ ఏకంగా 6,261 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు కూడా పలు బస్సులను ఏర్పాటు చేసింది. పాఠశాలలకు, కాలేజీలకు ముందుగానే సెలవులు ప్రకటించడంతో ఈనెల 12నే ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్‌లు కిటకిటలాడాయి. అలాగే తెలుగురాష్ట్రాల్లోని నగరాలు, పట్నాల నుంచే కాదు విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు చాలా మంది ఈసారి పండగకి సొంతూళ్లకు చేరుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 15 , 2024 | 11:56 AM