ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HYDRA: అలా చేస్తే చర్యలు తప్పవు.. రంగనాథ్ హెచ్చరిక

ABN, Publish Date - Nov 19 , 2024 | 03:25 PM

Telangana: పెద్ద చెరువు ముంపు బాధితుల ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువు విస్తీర్ణం 99 ఎకరాలు ఉందని, చెరువు అలుగులు, తూములు మూసివేయడంతో నీరు వచ్చి చేరి చాలా మంది ప్లాట్లు మునిగిపోయాయని ఫిర్యాదు అందిందని తెలిపారు.

HYDRA

సంగారెడ్డి జిల్లా, నవంబర్ 19: రాష్ట్రంలో చెరువులు కబ్జాలకు గురైన ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganth) పర్యటిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం హైడ్రా కమిషనర్ పర్యటించారు. అమీన్ పూర్ పెద్ద చెరువు, శంభునికుంట, పద్మావతి నగర్ కాలనీ, వెంకటరమణ కాలనీల వాసుల ఫిర్యాదు మేరకు కమిషనర్ అమరీన్‌పూర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. పెద్ద చెరువు ముంపు బాధితుల ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించామన్నారు. చెరువు విస్తీర్ణం 99 ఎకరాలు ఉందని, చెరువు అలుగులు, తూములు మూసివేయడంతో నీరు వచ్చి చేరి చాలా మంది ప్లాట్లు మునిగిపోయాయని ఫిర్యాదు అందిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం చేస్తామన్నారు. పద్మావతి నగర్ కాలనీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి కబ్జాపై ఫిర్యాదు‌ వచ్చిందని.. సర్వే చేయించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో..


హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో పార్కు కబ్జా అయినట్లు తెలిసిందన్నారు. శంభునికుంట చెరువు రెండు భాగాలుగా విభజించబడిందని ఎఫ్‌టీఎల్‌లో భవనాలు నిర్మించారని, వీటిపై ఎన్‌జీటీలో కేసులున్నాయని.. దీనిపై కూలంకుశంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. వెంకటరమణ కాలనీలో గోల్డెన్ కీ వారు పార్కు స్థలాలను కబ్జా చేశారని హైడ్రా అధికారులు గుర్తించారని.. వాటిని పరిశీలించి పార్కులు, ఓపెన్ స్థలం కబ్జా అయినట్లు నిర్థారణ అయితే హైడ్రా పరంగా తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. హైడ్రా ప్రధాన ఉద్దేశ్యం చెరువుల పునరుద్ధరణ, రోడ్లను, పార్కులను ఆక్రమించకుండా చర్యలు తీసుకోవడమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చిచెప్పారు.

'మహా' పోలింగ్ డే... హాలిడే


కాగా.. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఆక్రమణలకు గురైన బతుకమ్మ కుంటను రంగనాథ్ పరిశీలించిన విషయం తీలిసిందే. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మకుంట ప్రాంతంలో ఉన్న ఇళ్ల కూల్చివేతలు ఉండవి స్పష్టం చేశారు. వలం బతుకమ్మకుంటను పునరుద్దరిస్తామని తెలిపారు. స్థానిక ప్రజల్లో కూల్చివేతలు ఉంటాయనే అపోహ ఉందని.. ఆ అపోహలు తొలగించేందుకే బతుకమ్మకుంటకు వచ్చినట్లు చెప్పారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఐదెకరాల విస్తీర్ణంలోనే పునరుద్దణ చేస్తామన్నారు. బతుకమ్మకుంటలోకి వరద నీరు వచ్చే మార్గాలపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చిస్తామన్నారు. హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారం ఉందన్నారు. హైడ్రా నోటీసులు అక్రమణదారులకు వెళ్తూనే ఉంటాయని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

మండలిలో బొత్సను ఓ ఆటాడుకున్న మంత్రులు

HARISH RAO : కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డారు.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2024 | 03:36 PM