ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy: అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరించి.. కొత్త హంగులతో తీర్చిదిద్దున్నాం

ABN, Publish Date - Jan 12 , 2024 | 11:02 AM

రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ది పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృతంలో దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందన్నారు. రైల్వేకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామన్నారు.

విజయవాడ: రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ది పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృతంలో దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందన్నారు. రైల్వేకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామన్నారు. జనరల్ బడ్జెట్‌లో రైల్వేను విలీనం చేసి.. ఆర్ధికపరమైన సహకారం మోదీ అందిస్తున్నారన్నారు. రైల్వే మన దేశ సమగ్రత కు అద్దం పడుతోందని కిషన్ రెడ్డి అన్నారు. అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరించి.. కొత్త హంగులతో తీర్చిదిద్దున్నామన్నారు. 508 ర్వైల్వే స్టేషన్లను అమృత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేసేందుకు మోదీ భూమి పూజ చేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

‘‘ప్రధాన మంత్రి ఒకే రోజు ఇన్ని పనులు ప్రారంభించడం గిన్నిస్ రికార్డు. ఈ పనుల కోసం 25వేల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోంది. దేశంలో 41 వందే భారత్ రైళ్లు ఇప్పటి వరకూ మొదలయ్యాయి. సెమీ హై స్పీడ్ రైళ్లు ప్రపంచంలో మొదటి సారిగా స్వదేశీ టెక్నాలజీతో మనం నడిపాం. కొంతమంది మూర్ఖులు ఈ ప్రక్రియను అవమానించారు, వక్రీకరించారు. వాటిని అధిగమించి వందే భారత్ రైళ్లు నేడు అద్భుతంగా నడుస్తున్నాయి. గంటకు వంద కిలోమీటర్లు వేగంతో వెళ్లే విధంగా భద్రత, సౌకర్యాలతో రైళ్లు నడుస్తున్నాయి. వందే భారత్ తో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై, విశాఖకు కనెక్టివిటీ చేశాం

మోదీ సారధ్యంలో 85,434 కిమీ రైల్వే నెట్‌వర్క్ కొత్తగా ఏర్పాటు చేశాం. ఇది జర్మనీలో ఉన్న పూర్తి రైల్వే నెట్ వర్కుకు సమానం. 2004లో యూపీఏ హయాంలో రైల్వే బడ్జెట్ 8వేల కోట్లు, 2014లో 29 కోట్లు మాత్రమే. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు 2.40లక్షల కోట్లుకు బడ్జెట్ పెరిగింది.రైల్వే ట్రాక్ నిర్మాణం కూడా 70 శాతం పెరిగింది. కేంద్రం ఇప్పటి వరకూ 38,650 కోట్లు కేవలం రైల్వే విద్యుద్దీకరణ కోసం ఖర్చు చేసింది. ప్రజలు మరింత మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించడంపైనే మోదీ ఆలోచనలు, ఆచరణ అనేది అందరూ తెలుసుకోవాలి. కాలుష్య రహిత వ్యవస్థగా రైల్వేను మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:09 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising