TS News: ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు మెమో..
ABN, Publish Date - Jan 09 , 2024 | 11:17 AM
ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా- ఈ సీజన్ 10 నిర్వహణ ఒప్పందంపై సర్కార్ వివరణ కోరింది. ఈ ఫార్ములా విషయంలో అరవింద్ కుమార్ మెడకి ఉచ్చు బిగసుకుంటోంది.
హైదరాబాద్: ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా- ఈ సీజన్ 10 నిర్వహణ ఒప్పందంపై సర్కార్ వివరణ కోరింది. ఈ ఫార్ములా విషయంలో అరవింద్ కుమార్ మెడకి ఉచ్చు బిగసుకుంటోంది. ఒప్పందంలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని మెమోలో ప్రభుత్వం తెలిపింది. ఫార్ములా ఈతో త్రైపాక్షిక లాంగ్ ఫారమ్ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని అరవింద్ కుమార్‌ని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 50 కోట్ల రూపాయలు హెచ్ఎండీఏ నుంచి ఈ రేస్‌కు బదిలీ చేశారని అరవింద్ కుమార్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి.
Updated Date - Jan 09 , 2024 | 11:17 AM