Telangana: హీరో నాగార్జున, కొండ సురేఖ అంశంపై స్పందించిన పీసీసీ చీఫ్
ABN, Publish Date - Oct 11 , 2024 | 03:06 PM
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో హీరో అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ వెనక్కి తీసుకున్నారని పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ ఆరోజే క్లోజ్ అయిందన్నారు. రేవంత్ కేబినెట్ నుంచి కొండా సురేఖను తప్పిస్తాంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 11: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో హీరో అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ వెనక్కి తీసుకున్నారని పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ ఆ రోజే క్లోజ్ అయిందన్నారు. రేవంత్ కేబినెట్ నుంచి కొండా సురేఖను తప్పిస్తాంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.
Also Read: టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా నోయెల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నిక
ఈ అంశంపై పార్టీ అధిష్టానం సైతం ఎటువంటి వివరణ తమను కోరలేదని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ.. హీరో అక్కినేని నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కావాలని చేసినవి కావని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ వైఖరి వల్లే కొండా సురేఖ అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్నారు.
Also Read: మోదీ మీరే డీల్ చేయాలి.. లేకుంటే మూడో ప్రపంచ యుద్ధమే..
అయినా ఆమె అలా మాట్లాడాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఇదే అంశంలో హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. ఈ కేసులో కోర్టు ఏం చెబుతుందో చూద్దామన్నారు. అలాగే ఫిరోజ్ ఖాన్‌పై ఎంఐఎం దాడి ఘటనపై సైతం పీసీసీ చీఫ్ స్పందించారు. ఎంఐఎంతో స్నేహం వేరు, శాంతిభద్రతలు వేరని ఆయన పేర్కొన్నారు.
Also Read: దసరా వేళ హైదరాబాద్‌లో అమ్మవారికి అవమానం
ఫిరోజ్ ఖాన్‌పై దాడి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. అయితే దాడుల విషయంలో తమ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. అయితే ఇతర పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో చేరికలకు ప్రస్తుతానికి బ్రేక్ వేశామన్నారు.
Also Read: బొప్పాయి వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా..?
ఇక దసరా పండగ వేళ.. రెండో విడత కార్పోరేషన్ పదవులు కేటాయించాలని ముందుగా అనుకున్నామన్నారు. కానీ కుదరలేదని చెప్పారు. అయితే దీపావళి లోపు మాత్రం రెండో విడత కార్పొరేషన్ పదవులు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే తాను జిల్లాల పర్యటనకు వెళ్తానని ఆయన ప్రకటించారు.
Also Read: హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ.. ఎందుకంటే
Also Read: నేటితో ముగియనున్న మద్యం దరఖాస్తుల స్వీకరణ గడువు
అయితే భావితరాల భవిష్యత్ కోసమే హైడ్రా ఏర్పాటు చేశామన్నారు. మూసీ అభివృద్ధికి రూ. లక్షా యాబై వేల కోట్ల కేటాయించినట్లు వస్తున్న వార్తల్లో ఎక్కడా నిజం లేదన్నారు. అలా అని తాము ఎక్కడ ప్రకటించ లేదన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వందేళ్ల దోపిడీ జరిగిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.
For Telangana News And Telugu News
Updated Date - Oct 11 , 2024 | 03:29 PM